జైశ్రీరామ్.
శ్లో. అకర్తవ్యేష్వసాధ్వీవ తృష్ణా ప్రేరయతే జనంతమేవ సర్వ పాపేభ్యో లజ్జా మాతేవ రక్షతి.
ఆ. సాధ్వి కాని వనిత చందమౌనత్యాశ.
చేయరాని పనులు చేయఁ జేయు.
కన్నతల్లి యట్లు కాపాడు సల్లజ్జ,
చెడును చేయనీక నడుపు చుండు.
భావము. దుష్ట స్త్రీ వలె , అత్యాశ - మానవులను చేయరాని పనులు చేయటానికి ప్రేరేపిస్తుంది. లజ్జ (సిగ్గు) మాత్రం కన్నతల్లి వలె వారిని సమస్తపాపాలనుండి (చెడు పనులు చేయనీయకుండా) కాపాడుతుంది.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అందరు చదవ వలసిన మంచి సూక్తి ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.