గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జూన్ 2014, సోమవారం

సంత ఏవ సతాం నిత్యం ఆపదుద్ధరణక్షమాః...మేలిమి బంగారం మన సంస్కృతి, 216.

జైశ్రీరామ్.
శ్లో. సంత ఏవ సతాం నిత్యం ఆపదుద్ధరణక్షమాః
గజానా పంకమగ్నానాం గజా ఏవ ధురంధరాః. 
గీ. మంచివారిని కాపాడ మంచివారె                                                                      
తగుదురిలలోన తెలియుడీ! ధరణి పైన 
బురదఁ జిక్కిన నేనుగున్ బురద నుండి 
కావ గలిగిదేనుగే ఘన తరముగ.
భావము. ఎల్లప్పుడూ సజ్జనుల ఆపదలను తొలగించటానికి సజ్జనులే సమర్థులు. బురదలో దిగబడిన ఏనుగునుఏనుగులే బయటకు లాగగలుగుతాయికదా
జైహింద్. 
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిజమే .సజ్జనుడు ఆపదలో ఉంటే దుర్జనునకు సంతోషమే గాని ఆపదను తొలగించాలన్న ఉద్దేస్యం ఉండదు కదా .అసలు చెడ్డవాని లక్షణమే అది .అందుకే ఏనుగు పడితే ఏనుగే లాగగలదు అల్పునికి అనల్పునికీ అదేతేడా బాగుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.