జైశ్రీరామ్.
శ్లో. గుణః భూషయతే రూపం, శీలం భూషయతే కులం సిద్ధిః భూషయతే విద్యాం, భోగః భూషయతే ధనమ్.
ఆ. గుణము చేత రూపు, కులమది శీలమున్,
సిద్ధి చేత విద్య, చిద్గుణోప
భోగమున ధనంబు, భూషణంబగునయ్య.
రమ్య సుగుణ ధామ! రామ కృష్ణ!
భావము. రూపాన్ని గుణము , కులాన్ని శీలము, విద్యను సిద్ధి (విద్య ద్వారా నేర్చిన దాన్ని ఆచరించటం), ధనాన్ని భోగము ( సద్వినియోగం చేయటం) రాణింప జేస్తాయి.
జైహింద్.
1 comments:
నమస్కారనుకు
ప్రతి రోజూ ఒక మేలిమి బంగారాన్ని అందిస్తున్న మీ కృషికి ధన్య వాదములు
రమ్య మైన గుణముల ధామము శ్రీ రామ కృష్ణ గారి ఆంధ్రామృతము
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.