జైశ్రీరామ్.
శ్లో. నిజ సౌఖ్యం నిరుంధానో యో ధనార్జన మిచ్ఛతిపరార్థం భారవాహీవ క్లేశస్యైవ హి భాజనమ్.
ధనమును సంపాదించుచు
తనకొఱకది వాడుకొనక దాచుచుచునుండున్
తనవారి కొఱకు నెవ్వఁడు
తనసుఖమును వీడు నతఁడు. తనదుఃఖమదే.
భావము. తన సుఖాన్ని కాదనుకొని , ఎవడు ధనాన్ని సంపాదించాలనుకుంటాడో , వాడు - పరులకోసమే బరువులు మోసేవాడై కేవలం దుఃఖపాత్రుడౌతాడు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అందుకే అంటారు తనకు మాలిన ధర్మం పనికి రాదని రక్తం ధారపోసినా దాహం తీరదు తృప్తి ఉండదు ముఖ్యంగా ఈ రోజుల్లో లోకం తీరే అంత .బాగుంది ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.