గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, జూన్ 2014, మంగళవారం

అర్థాతురాణాం న గురు ర్న బంధుః,...మేలిమి బంగారం మన సంస్కృతి, 220.

జైశ్రీరామ్.
శ్లో. అర్థాతురాణాం న గురు ర్న బంధుః, 
కామాతురాణాం న భయం న లజ్జా,
క్షుధాతురాణాం న రుచి ర్న పక్వం, 
విద్యాతురాణాం న సుఖం న నిద్రా.

క. ధన రతులకు గురు, బంధులు
ననయము కామాతురులకునన భయ, లజ్జల్. 
పెనుక్షుధులకు రుచి, పక్వము, 
ఘన విద్యార్థికి కునుకు సుఖములుండవుగా.
భావము. ధనదాహం గలవాడికి గురువు లేడు, బంధువూలేడు. కామాతురునికి భయము, సిగ్గూ లేవు. ఆకలితో సతమత మౌతున్నవాడికి రుచి లేదు, ఉడికినదా, లేదా ? అనే ప్రశ్నయు లేదు. విద్య కొఱకు ఆతురత పొందువానికి సుఖము, నిద్రా లేవు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
వీరు ఒకరిని మించి మరికరు ఇటువంటి వారు చిత్తసుద్ధితోఏపనీ చేయ లేరు ఎప్పుడూ అశాంతిగానే జీవిస్తారు మంచి విస్గయాన్ని చెప్పారు ఇన్ని శ్లోకాలను మాకందిస్తున్నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.