జైశ్రీరామ్.
శ్లో. యద్దదాసి విశిష్టేభ్యో యచ్చాశ్నాసి దినే దినేతత్తే విత్తమహం మన్యే శేషమన్యస్య రక్షసి.
గీ. సజ్జనులకిచ్చు ద్రవ్యము సద్ధనంబు
పొట్ట నింపెడి ధనమును పూజ్య ధనము.
మిగులు ధనమది వ్యర్థంబు పగలు రేపు
ధనము సత్కార్యములకీయ ధన్యతనిడు.
భావము. ఏది ఒక విశిష్టవ్యక్తికి ఇవ్వబడుతుందో, ఏది దినదినమూ ఆహారంగా స్వీకరింపబడుతుందో అదే అసలైన ధనమని భావించాలి. మిగిలినది అన్యులను రక్షించటానికే !(అది సజ్జనులకూ దక్కదు, తనకూ దక్కదు)
జైహింద్.
1 comments:
నమస్కారములు
అందుకే " పాత్ర ఎంతో ప్రాప్తమంతే " అన్నారు . ఎంత ఉన్నా మనదికానిది మనకి తెలియ కుండానే వెళ్ళి ఫొతుంది ఇది ఖచ్చిత మైన నిజం .ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.