జైశ్రీరామ్.
శ్లో. న సా సభా యత్ర న సంతి వృద్ధా, న తే వృద్ధా యే న వదంతి ధర్మం నాసౌ ధర్మో యత్ర న సత్యమస్తి , న తత్ సత్యం యత్ఛలేనాభ్యుపేతమ్.
గీ. సభను పెద్దలు లేనిచో సభ యగునికొ?.
సిద్ధ ధర్మంబు తెలుపమిన్ బెద్ద యగునె?
ధర్మ మది సత్య దూరము ధర్మమగునె?
నిత్య వంచన యుక్తము సత్యమగునె?
భావము. ఎక్కడ పెద్దలుండరో అది సభయేకాదు. ఎవరు ధర్మం చెప్పరో వారు పెద్దలే కారు. ఎక్కడ సత్యం ఉండదో అది ధర్మమే కాదు. ఏది వంచనతో కూడి ఉంటుందో అది సత్యమేకాదు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
యజమాని లేని ఇల్లు , అధ్యక్షుడు లేని సభ , ఆడది లేని ఇల్లు ఆరిపోయిన వంట అన్నీ ఒక్కటే ఒకరకంగా ఇవన్నీ ఆత్మ వంచనే మంచి విషయాలను చెప్పారు .ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.