జైశ్రీరామ్.
శ్లో.సంహతిః శ్రేయసీ పుంసాం స్వకులైరల్పకైరపి తుషేణాపి పరిత్యక్తః తండులో న ప్రరోహతి .
గీ. అల్పులైనను తనవారి అండ నుండి
వృద్ధి చెందును సుజ్ఞాని పృథివి పైన.
అల్ప,మైనట్టి ఊకయందమరకుండ
తండులంబెటు మొల్చును? ధర్మ మిదియె.
భావము. తనవారు అల్పులైనా సరే , వారితో కలిసి ఉన్నవాడే శ్రేయస్సును పొందగల్గుతాడు. పొట్టు (ఊక) అల్పమైనదే.కానీ అది లేకుండా వడ్లగింజ మొలకెత్తదు కదా !
జైహింద్.
1 comments:
నమస్కారములు
నిజం .తక్కువ ఎక్కువ ,ధనము గొప్పతనము విద్య అవిద్య లాంటివి కొలతలు కావు సాటి మనిషి ఎవరైనా వినయముగా ప్రవర్తిం చడం సంస్కార వంతుల లక్ష్ణం మేలిమి బంగారం ఆంధ్రా మృత,
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.