గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జూన్ 2014, ఆదివారం

పుణ్యస్య ఫలమిచ్ఛంతి ....మేలిమి బంగారం మన సంస్కృతి, 225.

జైశ్రీరామ్.
శ్లో. పుణ్యస్య ఫలమిచ్ఛంతి, పుణ్యం నేచ్ఛంతి మానవాః
న పాప ఫలమిచ్ఛంతి, పాపం కుర్వంతి యత్నతః.  

ఆ. పుణ్య ఫలము కోరు, పుణ్యంబు చేయరు.   
పాప కార్య పరులు. పాప ఫలము
వలదు వలదనంద్రు, వలదన్న వదలునా?
పుణ్యకర్తవగుము పూజ్య సుగుణ!
భావము. మానవులు పుణ్యఫలాన్ని కోరుకుంటారేగానీ, పుణ్యకార్యాచరణకు ఇష్టపడరు! పాపఫలాన్ని కోరరు గానీ, ప్రయత్నపూర్వకంగా పాపాలు చేస్తూ ఉంటారు!
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అసలు ఫలాపేక్ష లేకుండా చేసేదే పుణ్యం.ఇక పాపాల సంగతి సరేసరి .మనుషుల మనసులు ప్రొద్దు తిరుగుడు పూలు .బాగుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.