జైశ్రీరామ్.
శ్లో. వరమసిధారా, తరుతల వాసో, వరమిహ భిక్షా, వరముపవాసః,
వరమపి ఘోరే నరకే పతనం,
న చ ధన గర్విత బాంధవ శరణమ్.
గీ. కత్తి యంచున నడచుట, కడగి చెట్ల
నీడఁ బ్రతుకుట, భైక్ష్యంబుతోడ నుంట,
నిరశనంబున నుండుట, నరకముంట
మేలు ధన గర్వ బంధువు మ్రోల కన్న.
భావము. ధనగర్వంతో మిడిసిపడే బంధువులను ఆశ్రయించటం కంటె, కత్తి అంచు మీద నడవటం, చెట్టు నీడలో నివసించటం, బిచ్చమెత్తుకోవటం, నిరాహారియై ఉండటం , చివరకు నరకంలో పడటమైనా శ్రేష్ఠం.
జైహింద్.
1 comments:
నమస్కారములు
మంచి మాట చెప్పారు .ఎన్నిఉన్నా ఆదరాభి మానాలతో పలుక రించే వారితో ఆనందంగా గడప గలం గానీ ధన మదాంధులతో ఒక్క క్షణం గడప లేము ఇది ఖచ్చిత మైన నిజం అటువంటి వారు తటస్త పడుతూనే ఉంటారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.