జైశ్రీరామ్.
శ్లో. ఉద్యంతు శతమాదిత్యా ,ఉద్యంతు శతమిందవః న వినా విదుషాం వాక్యైర్నశ్యత్యాభ్యంతరం తమః.
గీ. వంద సూర్యులు, చంద్రులు వందమంది
మనసు లోపలి తిమిరమ్ము మాప లేరు.
ఒక్క సుజ్ఞాని సందేశ మొకటి చాలు,
మనసు లోపలి తిమిరమ్ము మాప గలదు.
భావము. వందమంది సూర్యులు ఉదయించినా, వందమంది చంద్రులు ఉదయించినా - ఒక జ్ఞానియొక్క సత్సందేశం వింటే తప్ప మనస్సులోని చీకటి నశించదు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
బోధనా పటిమ శక్తి వంత మైనది చదవడం కంటె వీనుల విందుగా వినడం వలన తాదాత్మత జెంది మనసుకు బాగా హత్తుకుంటుంది చక్కని నిజాన్ని చెప్పారు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.