జైశ్రీరామ్.
శ్లో. న ద్విషంతి , న యాచంతే , పరనిందాం న కుర్వతే అనాహూత న చాయాంతి , తేనాశ్మనో உపి దేవతాః!
గీ. ద్వేషమెఱుగదు, యాచనతెలియదెపుడు,
పరులనిందింప నేరదు. పరులకడకు
పిలువ కుండగ వెళ్ళదు. వీటి వలన
దైవమైనది రాయియు. తలపరేల?
భావము. ఎవరినీ ద్వేషించటంలేదు, ఎవరినీ యాచించటంలేదు, పరనింద చేయటంలేదు, పిలువని చోటికి వెళ్ళటంలేదు - ఈ కారణాలవల్ల శిలలుకూడా దేవతలౌతున్నాయి !
జైహింద్.
1 comments:
నమస్కారములు
అవును ఏవరి జోలికీ వెళ్ళ కొండా దేని గురించి పట్టించు కోకుండా మౌన ముద్ర వహించి శిలగా మారితే అదే దైవత్వం చాలా బాగుంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.