గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, జూన్ 2014, శనివారం

మనీషిణః సంతి న తే హితైషిణః .....మేలిమి బంగారం మన సంస్కృతి, 224.

జైశ్రీరామ్
శ్లో. మనీషిణః సంతి న తే హితైషిణః 
హితైషిణస్సంతి న తే మనీషిణః
సహృచ్చల విద్వానపి దుర్లభో నృణాం 
యథౌషధం స్వాదు హితంచ దుర్లభమ్.

ఆ. బుద్ధిమంతులహిత మూర్తులు కావచ్చు. 
హితము కోరు జ్ఞానమతులునరుదు.
హితము కోరు జ్ఞాన మతులుకల్గుటయన్న, 
మందు రుచిగనొప్పి ముందునుంట.
భావము. బుద్ధిమంతులున్నా, వారు హితాన్ని కోరేవారు కాకపోవచ్చు. హితాన్ని కోరేవారున్నా , వారు విద్వాంసులు కాకపోవచ్చు. సహృదయులు,విద్వాంసులు కూడా ఐనవారు – రుచిగల ఔషధం వంటివారు. మానవులలో అలాంటివారు లభించటం చాలా అరుదు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చదువు వేరు , సంస్కారం వేరు .చదువు కుంటే పండితులు కాగలరు కానీ సంస్కారమనేది పుట్టుకతో కొంత ఉండాలి అసూయా ద్వేషాలు లేకుండా ఎదుటివ్యక్తిని అభిమానించగల సహృదయం ఉండాలి అటువంటి వారికి ఇంకేవీ అడ్డురావు .అందరికీ ఉపయోగ పడే మంచి సూక్తి .ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.