జైశ్రీరామ్.
శ్లో.ఫణినో బహవః సంతి భేక భక్షణ తత్పరాఃఏక ఏవహి శేషో உయం ధరణీ ధరణ క్షమః.
క. కప్పలను తినెడి ప్లాములు
తెప్పలుగానుండు కాని దివ్య ధరిత్రిన్
గొప్పగ మూపున మోసెడు
నప్పలువురి లోననొకఁడె యధిపతి యననౌన్.
భావము. కప్పలను తినటంలో ఆసక్తిగల పాములు చాలాఉన్నాయి. కానీ , భూ భారాన్ని వహించగల సామర్థ్యం , ఓర్పు గలవాడు శేషుడు ఒక్కడే.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అందుకే ఆది శేషుడైనాడు భారం వహించడం మాత్రమే తెలిసిన వాడు చాలా బాగుంది ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.