జైశ్రీరామ్.
శ్లో. అర్థానామార్జనం కార్యం, వర్థనమ్ రక్షణం తథా,భక్ష్యమాణో నిరాదాయః సు మేరురపి హీయతే.
క. ఆర్జింప వలయు ధనమును,
ఆర్జించిన దాని పెంచి, యరయుచు సుఖమువ్
వర్జించి రక్ష సేయుక,
ఆర్జన విడి తినిచునున్న హరియించుకుపోన్.
భావము. ధనమునార్జించుట కర్తవ్యము. ఆ ధనమును వృద్ధి చేయుట రక్షించుట అవసరము. సంపాదించకుండా ఉన్నది తింటూ కూర్చున్నచో మేరు పర్వతమైననూ తరిగిపోవును.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.