జైశ్రీరామ్.
శ్లో. వేపథుర్మలినం వక్త్రం , దీనా వాగ్గద్గః స్వరః
మరణే యాని చిహ్నాని , తాని చిహ్నాని యాచకే.
మరణే యాని చిహ్నాని , తాని చిహ్నాని యాచకే.
క. యాచన మృత్యు సమానము.
యాచించెడు వాని మలినమావనంబౌన్
యాచకు పలుకులు వణకును.
యాచకుఁడును మృతుని పోలు యాచన వేళన్.!
భావము. వణకుతో ముఖం మలినమైపోతుంది , దీన భావంతో వాక్కు గద్గదమౌతుంది. మరణసమయంలో ఏ చిహ్నాలు వస్తాయో అవన్నీ యాచకునిలో కనిపిస్తాయి. (యాచన - మరణంతో సమానం)
జైహింద్.
1 comments:
నమస్జారములు
ఒకరిని చెయి జాపి యాచించడం అన్నది చాలా దుర్భర మైన పరిస్థితి. అంధుకే వెనకటి రోజుల్లోమరీ తప్పని పరిస్థ్తితిలో " ణా మీసం తాకట్టు పెట్టాను అనేవారట " రోషానికి ప్రతీకగా . మంచి వి షయం చెప్పారు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.