గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, జూన్ 2014, మంగళవారం

కరావివ శరీరస్య , ....మేలిమి బంగారం మన సంస్కృతి, 214

జైశ్రీరామ్.
శ్లో. కరావివ శరీరస్య , నేత్రయోరివ పక్ష్మణి
అవిచార్య ప్రియం కుర్యాత్తన్మిత్రం మిత్రముచ్యతే. 
ఆ. దేహమునకు మేలు దేహ భాగములెట్టు 
లప్రయత్నముగనె యరసి చేయు 
నటులె చేయుచుండు నరసి సన్మిత్రుఁడు. 
మిత్రుఁడనిన యతఁడె ధాత్రిపైన.
భావము. శరీరానికి చేతుల వలె, కళ్ళకు రెప్పల వలె అప్రయత్నంగా ప్రియం చేకూర్చేవాడే మిత్రుడు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును అవుసరాన్ని బట్టి వెన్నంటి నిలబడ గలిగిన వాడేఅసలైన మిత్రుడు .ఇప్పడికీ అటువంటి వారు లేక పోలేదు మంచి విషయం చెప్పారు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.