గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జూన్ 2014, ఆదివారం

శరీరస్య గుణానాం చ దూరమత్యంత మంతరం....మేలిమి బంగారం మన సంస్కృతి, 218.

జైశ్రీరామ్.
శ్లో. శరీరస్య గుణానాం చ దూరమత్యంత మంతరం
శరీరం క్షణవిధ్వంసి కల్పాంతస్థాయినో గుణాః.

క. దేహము క్షణ భంగురమే.
దేహస్థిత గుణము స్థిరము.దేహస్థులు వ్యా 
మోహము విడనాడుచు తమ 
దేహముతో శుభముఁ గూర్చి దీపించ తగున్.
భావము. శరీరానికీ , గుణాలకూ చాలా అంతరం ఉంది. శరీరం క్షణంలో నశించిపోయేది. గుణాలు మాత్రం కల్పాంతానికి కూడా నిలిచి ఉంటాయి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును మిత్రలాభంలో చెప్పినట్టు , శరీరాలు లేకపోయినా వారి సంగీత సాహిత్యాలను ,సకల కళా వైభవాలను గుణగణాలను మనం అనునిత్యం స్మరిస్తూనే ఉంటాం .వారు అమరులు .చాలా బాగుంది.ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.