గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, జులై 2023, శుక్రవారం

అంజలిస్తాని పుష్పాణి...మేలిమి బంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో. అంజలిస్తాని పుష్పాణి

వాసయంతి కరద్వయం ౹

అహో సుమనసాం

ప్రీతిర్వామదక్షిణయో: సమా౹౹

తే.గీ.  కరములన్ జేరు పుష్పముల్ కలుగఁ జేయు

రెండు చేతులకున్ దావి మెండుగటులె

మంచివారిని చెడువారనెంచకుండ

ప్రేమగా జూతురందరిన్ ధీమహితులు.

భావము.       

చేతిలో ఉన్న పువ్వులు భేదం లేకుండా రెండు చేతులను 

సుగంధ భరితంగా చేస్తాయి. అలాగే సహృదయులు చెడ్డవారని, 

మంచివారని బేధం లేకుండా సమంగా ప్రేమిస్తారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.