జైశ్రీరామ్.
శ్లో. సుందరోsపి సుశీలోsపి - కులినోsపి మహాధనః ౹
శోభతే న వినా విద్యాo విద్యా - సర్వస్య భూషణం ౹౹
తే.గీ. సుందరంబగు రూపము, నందమయిన
శీలసంపద, ధనమును, శ్రీకరమగు
వంశమందున జననము, పడయవచ్చు
విద్య మనకు లేకున్నచో వెలుగ లేము.
భావము. అందంగా ఉన్నా, సరళమైన నడతలు ఉన్నవాడైనా,
ఉత్తమమైన కులములో పుట్టినా,ఎక్కువ సంపదలు ఉన్నవాడైనా సరే
విద్య లేనిచో ఆ మనిషి శోభించడు. అన్నిటికీ మూలం విద్య.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.