గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, జులై 2023, సోమవారం

యదగ్రే చానుబన్ధే చ సుఖం - ...18 - 39...//... న తదస్తి పృథివ్యాం వా దివి - ...18 - 40,,,//.....అథాష్టాదశోధ్యాయము - మోక్షసంన్యాసయోగము

 జైశ్రీరామ్.

శ్లోయదగ్రే చానుబన్ధే సుఖం మోహనమాత్మనః|

నిద్రాలస్యప్రమాదోత్థం తత్తామసముదాహృతమ్. || 18-39 ||

తే.గీనిద్దుర, మరుపు,నుండియు బద్ధకంబు 

నుండియునుబుట్టి, మరిముందు నుండివెనుక

వరకు భ్రాంతిలో పడవేయు పరమసుఖము

తామసికమని యెఱుఁగుము ధరణిపైన.

భావము.

నిద్ర, బద్ధకము, ఏమరుపాటుల నుండి జనించి ముందు నుండి చివరకు భ్రాంతిలో 

పడఁజేసి ఉంచెడి సుఖము తామసికము

శ్లో తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః|

సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్త్రిభిర్గుణైః. || 18-40 ||

తే.గీప్రాకృతంబైన గుణములై వరలుచున్న

యీ త్రిగుణములన్ విడివడి యింత వరకు

కలుగు వారలు స్వర్గాన, క్ష్మాప్రదేశ

మందునన్ లేరు, గ్రహియింపమందు నిన్ను,

భావము.

భూమిపైనగాని, స్వర్గములోని దేవతలలో కాని ప్రకృతి వలన పుట్టిన  

మూడు గుణముల నుండి విడిపడి ఉన్నప్రాణి ఏదీయు లేదు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.