జైశ్రీరామ్.
శ్లో:- అహింసా ప్రధమం పుష్పం, పుష్ప మింద్రియ నిగ్రహః
సర్వ భూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః
శాంతి:పుష్పం, తపః పుష్పం, ధ్యానం పుష్పం తధైవచ
సత్యమష్ట విధం పుష్పం విష్ణో:ప్రీతికరం భవేత్.
చం. విమల యహింసయున్ మరియు వెల్గెడి యింద్రియ నిగ్రహంబు,భూ
తములెడ నంతులేని దయ, తాల్మియు, శాంతి, తపంబు, ధ్యానమున్,
ప్రముదము గొల్పు సత్యమను భాసిలు పుష్పచయంబు, వీటితో
సుమధుర భావనన్ హరిని శోభిలఁ గొల్చిన ప్రీతిఁ జెందెడున్.
భావము:-
అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వ భూత దయ, ఓర్పు, శాంతి, పరమాత్మకై తపించుట, పరమాత్మ ధ్యానము, సత్యనిరతి అనే ఎనిమిది విధములైన పుష్పములతో హరిని ఆరాధిస్తే చాలా సంతోషిస్తాఁడు హరి.
జైహింద్.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.