గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, జులై 2023, సోమవారం

కాకః కృష్ణః పికః కృష్ణః ....మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  కాకః కృష్ణః పికః కృష్ణః 

కో భేదః పికకాకయోః! 

వసంతకాలే సంప్రాప్తే

కాకః కాకః పికః పికః!!

తే.గీ.  నలుపుగానుండు కాకము, నలుపు పికము,

రెంటికిని గల భేద మేక్రియను గనుట?

వచ్చినపుడు వసంతము వ్యక్తమగును

కాకపికముల భేదంబు, గరుఁడ గమన!

భావము. 

కాకి నల్లగా ఉంటుంది.  కోకిల కూడా నల్లగా ఉంటుంది. 

కాని వసంత కాలంలో కాకి గొంతులోని కాఠిన్యం, కోకిల గొంతులోని 

మాధుర్యం సులువుగా గుర్తించవచ్చు.

🙏

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.