జైశ్రీరామ్.
శ్లో. గుణైరుత్తుంగతాం యాతి
నోచ్చైరాసన సంస్థితః|
ప్రాసాద శిఖరస్థోsసి
కాకః కిం గరుడాయతే ||
తే.గీ. గుణముతోడ నౌన్నత్యంబు ఘనతరమగు,
నాసనముపైన కూర్చున్న నమరఁ బోదు,
రాజభవన శిఖరమున వ్రాలి నంత
కాకి గ్రద్దగా నగుటది కల్ల కాదె?
భావము. మనుష్యుడు గుణముతోనే యౌన్నత్యము పొందును.
ఉన్నతమైన ఆసనము మీద కూర్చుండినంత మాత్రము
ఔన్నత్యము కలుగబోదు. రాజభవనము యొక్క
శిఖరము మీద కూర్చుండినంత మాత్రముచేత కాకి గరుడపక్షి యగునా?
జైహింద్.
చింతా రామకృష్ణారావు.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.