జైశ్రీరామ్.
జైశ్రీమన్నారాయణ!🙏
శ్లో. యథా వాతరథో ఘ్రాణమావృంక్తే గంధ ఆశయాత్|
ఏవం యోగరతం చేతః ఆత్మానమవికారి యత్॥...కపిల గీత - 210
తే.గీ. పూల వాసన వాయువు మూలమునను
ఘ్రాణమును చేరు విధముగా ఘనతరముగ
యోగరతుని చేతనమది రాగము పగ
లకది దూరమై బ్రహ్మలో లయమగునయ.
భావము. పుష్పముల పరిమళము వాయువు ద్వారా ఘ్రాణేంద్రియమునకు
చేరినట్లు, భక్తియోగ తత్పరుడైన పురుషుని చిత్తము
రాగద్వేషాది వికార శూన్యమై పరమాత్మను చేరును.
🙏
చింతా రామకృష్ణారావు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.