గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, జులై 2023, శుక్రవారం

యయా స్వప్నం భయం శోకం - ...18 - 35...//... సుఖం త్విదానీం త్రివిధం - ...18 - 36,,,//.....అథాష్టాదశోధ్యాయము - మోక్షసంన్యాసయోగము

జైశ్రీరామ్.

శ్లోయయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ |

విముఞ్చతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ. || 18-35 ||

తే.గీశోక, భయ, స్వప్న, ఖేదముల్, లోకమునను

మదము లను పట్టి విడువక మసలుటదియె

తామసమ్మగున్, మనకిలఁ దగనిదిదియె.

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

పార్ధా! మూర్ఖుడు ధృతితో స్వప్నములను, భయమును, శోకమును, విషాదమును

మదమును విడువక పట్టుకొనునో అది తామసికము అయిన పట్టుదల.

శ్లోసుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ|

అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాన్తం నిగచ్ఛతి. || 18-36 ||

తే.గీ. దేని నభ్యాస ముననొంది దివ్యమయిన 

సుఖము నరుడొందు దుఃఖంబు సోకనీయ

కట్టి మూడు సుఖమ్ముల నర్జునుండ!

నీకుఁ దెలిపెద గ్రహియించు, నేర్పుమీర.

భావము.

భరతశ్రేష్ఠుఁడా! అభ్యాసము వలన దేనిలో మానవుడు దుఃఖమును 

అంతమొనరించి సుఖపడ కలుగునో మూడు విధములైన సుఖములను 

గురించి వినుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.