గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జులై 2023, సోమవారం

ప్రమితాక్షర వృత్తంలో కందం కూడా వచ్చేలా వ్రాయుట ఇంతసులభమా అని మీరే అంటారు ఇది చూస్తే.

 జైశ్రీరామ్.

ఆర్యులారా! ప్రమితాక్షర వృత్త లక్షణములు పరికింపుడు.

గణములు....స....జ....స....స.

యతిస్థానము....9వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

ఉదా....

నీ! మదంబ! పలున్

మ్మ వాంబుజాక్షి! నుమా! కృపతో,

వినుతింతునమ్మ! మనవిన్ విను

మ్మ! నుతప్రవృత్తిఁ బెంచు, మదిలో.

చూచారు కదా. ఈ ప్రమితాక్షర పద్యము లోని మొదటి పాదము 

ఆఖరి గణమునురెండవపాదం మొదటి గణంగా 

దించి చూచినచో ఏమగునో గమనింపుడు. 

ప్రమితాక్షర గర్భగత కందము

నీ! మదంబ! పలున్ 

మ్మ వాంబుజాక్షి! నుమా! కృపతో,

వినుతింతునమ్మ! మనవిన్ 

వినుమ్మనుతప్రవృత్తిఁ బెంచు, మదిలో.

చూచారా? ఇది కందపద్యమయిందని గుర్తించారా?

కాకపోతే మనం ప్రమితాక్షరీ వృత్తం వ్రాయునపుడు 

కొన్ని  ప్రత్యేక నియమాలు పాటిస్తే సరిపోతుంది.  అవి....

ఏఅక్షరమయితే ప్రమితాక్షరలో ప్రాసాక్షరంగా ఉందో 

ఆ హల్లునే 11వ అక్షరంగా వెయ్యాలి.

అదే విధంగా 10వ అక్షరం ఏదైతే ఉంటుందో దానికి

యతిగా రెండవ పాదంలోని 7వ అక్షరము వెయ్యాలి. అంతే. 

అద్భుతమయిన కందంగా కూడా మనకి స్పష్టమౌతుంది.

మీరూ వ్రాసే ప్రయత్నం చేశారో చిత్రకవిత్వం మీకు 

వశమైపోతుంది మెల్లమెల్లగా. మరెందుకు ఆలస్యం? 

ప్రయత్నించండి. శుభమస్తు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.