గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, ఏప్రిల్ 2022, శుక్రవారం

ఇహైవ తైర్జితః సర్గో యేషాం..|| 5-19 ||..//..న ప్రహృష్యే త్ప్రియం ప్రాప్య..|| 5-20 ||..//..5వ అధ్యాయము. కర్మసన్యాస యోగము.

0 comments

  జైశ్రీరామ్.


శ్లో.  ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః|

నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః.

తే.గీ.  ఎవరి మనసు సామ్యస్థితి నెల్లవేళ

లందు నిలుచునో వారలే యనుపమ

విజిత సంసార బంధ స న్నిజశరీరు

లరయ వారలా బ్రహ్మమే ధరణి దలప.

భావము.

ఎవరి మనస్సు సామ్యస్థితిలో నిలిచి ఉంటుందో, వారు ఈ శరీరంలో 

ఉండగానే సంసారాన్ని జయిస్తారు. నిర్దోషమైన బ్రహ్మము అన్నింటా 

సమంగా ఉన్నందున వాళ్ళు కూడా బ్రహ్మమంలోనే నిలిచి ఉంటారు.

|| 5-20 ||

శ్లో.  న ప్రహృష్యే త్ప్రియం ప్రాప్య నోద్విజే త్ప్రాప్య చాప్రియమ్|

స్థిరబుద్ధి రసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః.

తే.గీ. సుస్థిరంబగు బుద్ధితో శోభిలుచును

భ్రాంతి రహిత బ్రహ్మజ్ఞాని పరవశింప

డతని కానందదంబైనదందినపుడు,

క్రుంగ డప్రియప్రాప్తికిన్, గుణనిధాన!

భావము.

స్థిరమైన బుద్ధితో, బ్రాంతి రహితుడై బ్రహ్మతత్వంలోనిలిచి ఉన్న 

బ్రహ్మజ్ఞాని, ప్రియమైనది లభించినపుడు సంతోషించడు అప్రియమైనది 

లభించినప్పుడు ఉద్వేగాన్ని పొందడు.

.జైహింద్.

28, ఏప్రిల్ 2022, గురువారం

తద్బుద్ధయ స్తదాత్మాన.. || 5-17 ||..//....//.విద్యావినయ సమ్పన్నే.|| 5-18 || ..//..పఞ్చమోధ్యాయః - సన్న్యాసయోగః.

0 comments

  జైశ్రీరామ్. 

 || 5-17 ||

శ్లో. తద్బుద్ధయ స్తదాత్మాన స్తన్నిష్ఠా స్తత్పరాయణాః|

గచ్ఛన్త్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః.

తే.గీ.  ఆత్మలో బుద్ధి నిలుపుచు నాత్మభావ

మునె మదినినింపి యత్మయే ముఖ్యమనెడి

జ్ఞాన నిర్దూత కల్మషుల్ ఘనులు కనగ

జన్మరాహిత్యమొందు ప్రశస్తముగను.

భావము.

ఆత్మలోనే బుద్ధిని నిలిపి, ఆత్మభావంతో మనసు నింపి, ఆత్మనే 

అంతిమ లక్ష్యంగా పెట్టుకుని అత్మాభాసం చేసేవాళ్ళు పాపములు 

నశింప బడిన వారై తిరిగిరాని స్థిని పొందుతారు.

|| 5-18 ||

శ్లో.  విద్యావినయ సమ్పన్నే బ్రాహ్మణే గవి హస్తిని|

శుని చైవ శ్వపాకే చ పణ్డితాః సమదర్శినః.

తే.గీ. 

వసుధ విద్యా వినయులగు బ్రాహ్మణులను, 

కుక్క నేనుగున్ గోవును కుక్క మాంస

భక్షకుల సమదృష్టితో పరిగణించు

పండితుడు సమదర్శియై, వంద్యుడతడు.

భావము.

మహాత్ములు విద్యా వినయాలతో కూడిన బ్రాహ్మణుడిలో, గోవులో, 

ఏనుగులో, కుక్కలో, కుక్కమాంసాన్ని వండుకుని తినే చంఢాలునిలో 

కూడా పండితులు సమాన తత్వాన్నే చూస్తారు.

.జైహింద్.

27, ఏప్రిల్ 2022, బుధవారం

నాదత్తే కస్యచిత్పాపం న...|| 5-15 ||...//..జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం..|| 5-16 ||..//..పఞ్చమోధ్యాయః - సన్న్యాసయోగః

0 comments

  జైశ్రీరామ్. 

|| 5-15 ||

శ్లో.  నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః|

అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యన్తి జన్తవః.

తే.గీ. పుణ్య పాపంబులన్ గొనని పూజ్యుడు హరి,

జ్ఞాన మదికప్పబడెడు నజ్ఞానమునను,

భ్రాంతిలో మున్గి ప్రాణులు వర్తిలుటను

తేలియవచ్చును చూచినన్ తెలివి గలిగి.

భావము.

భగవంతుడు పాపాలను కాని, పుణ్యాలని కాని స్వీకరించడు. జ్ఞానం 

అజ్ఞానంచేత కప్పబడుతుంది. అందుచేత ప్రాణులు భ్రాంతులౌతారు.

|| 5-16 ||

జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః|

తేషామాదిత్యవజ్జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్.

తే.గీ.  పూర్ణ సుజ్ఞాన బలముచే పూర్తిగాను

వసుధ నజ్ఞాన మెవనిలో పాపబడునొ

వానిలో దైవతేజంబు  భానునివలె

చూడ గనిపించు నిజమిది సుగుణతేజ!

భావము.

ఎవరిలో నయితే సమగ్రమైన జ్ఞానం ద్వారా అజ్ఞానం నాశనం చేయబడినదో 

వారిలో ఆ పరమాత్మ జ్ఞానము సూర్యునివలె ప్రకాశింప బడుతుంది.

.జైహింద్.

26, ఏప్రిల్ 2022, మంగళవారం

. వినాయక ప్రార్థన. సీసగర్భస్థ దండకం.. రచన. చింతా రామకృష్ణారావు.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

కవిశేఖరులు శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారితో ముఖాముఖీ. #కవిసమయం,..నానీస్ మహతీ చానల్.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

25, ఏప్రిల్ 2022, సోమవారం

సర్వకర్మాణి మనసా సంన్యస్యాస్తే..|| 5-13 ||..//..న కర్తృత్వం న కర్మాణి లోకస్య..|| 5-14 ||..//..పఞ్చమోధ్యాయః - సన్న్యాసయోగః

0 comments

 జైశ్రీరామ్. 

పఞ్చమోధ్యాయః - సన్న్యాసయోగః

|| 5-13 ||

శ్లో.  సర్వకర్మాణి మనసా సంన్యస్యాస్తే సుఖం వశీ|

నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్.

తే.గీ.  కర్మసన్యాసి విజితాత్ము డర్మిలి తన

దేహదదేవాలయంబున తేలుచుండు

సంతసమ్మున యెమియు సుంతయేని

చేయడిక చేయజేయడు జితవిధాత. 

భావము.

మానసికంగా అన్ని కర్మల్ను సన్యసించి, పూర్తిగా తనను తాను 

స్వాధీనంలో ఉంచుకున్న దేహధారి, తొమ్మిది ద్వారాల పురంలో 

తాను ఏమీ చేయకుండా, ఎవరిచేత చేయించ కుండా సుఖంగా ఉంటాడు.

|| 5-14 ||

శ్లో.  న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః|

న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే.

తే.గీ. క్షితిని కర్తృత్వమున్ కర్మ సృజన చేయ

డరయ దైవమ్ము, కర్మ మహాఫలంబు

లందబోవడు, ప్రకృతియె యట్టు లమరి

నడచుచుండును సృష్టి నీవరయు మిదియు.

భావము.

భగవంతుడు కర్తృత్వాన్ని గానీ, కర్మలని గానీ సృజించడం లేదు. 

కర్మ ఫలంతో సంయోగాన్ని ఆయన చేయడు. ప్రకృతే ఆ ప్రకారంగా 

వ్యవహరిస్తుంది.

.జైహింద్.

24, ఏప్రిల్ 2022, ఆదివారం

కాయేన మనసా బుద్ధ్యా.. || 5-11 ||..//.. యుక్తః కర్మఫలం త్యక్త్వా..|| 5-12 ||..//..పఞ్చమోధ్యాయః - సన్న్యాసయోగః

0 comments

జైశ్రీరామ్. 

|| 5-11 ||

శ్లో.  కాయేన మనసా బుద్ధ్యా కేవలైరిన్ద్రియైరపి|

యోగినః కర్మ కుర్వన్తి సఙ్గం త్యక్త్వాత్మశుద్ధయే.

తే.గీ. త్రికరణములను శుద్ధులై శ్కటితమగు

భావము.సంగ రహితులై యోగులు సకలకార్య

ములను కేవలేంద్రియములన్ పూర్తి చేసి

కర్మఫలదూరులైయుందురర్మిలి సఖ!

యోగులు తమ అంతఃకరణ శుద్ధి కోసం సంగభావాన్ని వదిలి కేవలం 

శరీర, మనో, బుద్ధి. ఇంద్రియాలతో మాత్రమే కర్మలు చేస్తారు.

|| 5-12 ||

శ్లో. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాన్తిమాప్నోతి నైష్ఠికీమ్|

అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే.

తే.గీ.  అరయ కర్మఫలత్యాగి యగుచు యోగి

శాశ్వతంబైన శాంతినే సతము గనును.

కోరికలు వీడనేరక కూరుకొనుచు

పోవుచుండును బంధనములనయోగి.

భావము.

యోగయుక్తుడైన వాడు కర్మఫలాన్ని వదిలి పెట్టి శాశ్వత మైన శాంతిని 

పొందుతాడు. యోగికానివాడు కోరికల కారణంగా కర్మఫలానికి అతుక్కు 

పోయి బంధింప బడతాడు.

జైహింద్.

23, ఏప్రిల్ 2022, శనివారం

ప్రలపన్విసృజన్గృహ్ణన్ను..|| 5-9 ||..//..బ్రహ్మణ్యాధాయ కర్మాణి సఙ్గం..|| 5-10 ||..//..పఞ్చమోధ్యాయః - సన్న్యాసయోగః

0 comments

జైశ్రీరామ్.

|| 5-9 ||

ప్రలపన్విసృజన్గృహ్ణన్నున్మిషన్నిమిషన్నపి|

ఇన్ద్రియాణీన్ద్రియార్థేషు వర్తన్త ఇతి ధారయన్.

తే.గీ. మాట లాడునప్పుడు, వీడి మనునపుడును,

పట్టుకున్నప్డును, కనురెప్ప పడి తెరచు

నపుడు నింద్రియముల్ విషయముల సంచ

రించుట నెరుగు, నిజమునే, యెరుగు తాను.

భావము.

మాట్లాడుతున్నప్పుడు, వదిలేస్తున్నప్పుడు, పట్టుకుంటున్నప్పుడు. 

కనురెప్ప మూసి తెరచునప్పుడు, ఇంద్రియముల విషయమున 

సంచరించుట తాను గ్రహించును.

|| 5-10 ||

శ్లో. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సఙ్గం త్యక్త్వా కరోతి యః|

లిప్యతే న స పాపేన పద్మపత్రమివామ్భసా.

తే.గీ. బ్రహ్మ కర్పించి కర్మలన్, భక్తి గలిగి,

సంగ భావంబు వీడిన సన్నుతు లిల

నీట తామర తడవని వాటమునను

పాప మంటక శుద్ధులై వరలుదురిల.

భావము.

ఎవరైతే కర్మలను బ్రహ్మమునకు అర్పించి, సంగభావాన్ని వదిలి 

పనిచేస్తారో, అట్టివాడు నీటిలో ఉన్న తామరాకు ఎలా నీటివలన 

తాకబడదో అలాగే పాపం చేత తాకబడడు.

జైహింద్.

22, ఏప్రిల్ 2022, శుక్రవారం

యోగయుక్తో విశుద్ధాత్మా.. || 5-7 ||..//..నైవ కిఞ్చిత్కరోమీతి యుక్తో..|| 5-8 ||..//..పఞ్చమోధ్యాయః - సన్న్యాసయోగః

0 comments

జైశ్రీరామ్.

 || 5-7 ||

శ్లో‌. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేన్ద్రియః|

సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే.

తే.గీ. కర్మ యోగమ్మునన్ గూడి, నిర్మలమగు

చిత్తముండి జితేంద్రియ సిద్ధులిలను,

తెలియుదురిల నాత్మ వలెను దీపితమగు

పరుల యాత్మలన్, జిక్కడు బంధములకు.

భావము.

కర్మ యోగంతో కూడుకొని, విశుద్ధం ఐన బుద్ధితో మనస్సు, ఇంద్రియాలను 

జయించి, అన్ని ప్రాణులలోని ఆత్మను తన ఆత్మగా తెలుసుకున్న వాడు 

కర్మలను చేసినా బంధంలో చిక్కుకోడు.

|| 5-8 ||

శ్లో. నైవ కిఞ్చిత్కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్|

పశ్యఞ్శృణ్వన్స్పృశఞ్జిఘ్రన్నశ్నన్గచ్ఛన్స్వపఞ్శ్వసన్.

తే.గీ. సత్య మెరిగిన యోగి తా సతము గనుచు

చూచుట, వినుటయును, స్పృశించుటయు, గాలి

పీల్చుట, తినుట, వాసన పీల్చుటయును

నిద్రయును, తాను చేయమిన్ నిరత మెరుగు.

భావము.

పరమసత్యాన్ని ఎరిగిన యోగయుక్తుడు చూస్తున్నప్పుడు, 

వింటున్నప్పుడు, స్పృసిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, 

తింటున్నప్పుడు, పడుకుంటున్నఫ్ఫుడు, ఊపిరి పీలుస్తున్నప్పుడు

వేదాంత దేశిక శ్లోకము. | శ్రీ రంగనాయక పాదుకా సహస్రం | @SWADHARMAM

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

21, ఏప్రిల్ 2022, గురువారం

యత్సాఙ్ఖ్యైః ప్రాప్యతే స్థానం..|| 5-5 ||..//...సన్న్యాసస్తు మహాబాహో ..|| 5-6 ||..//..పఞ్చమోధ్యాయః - సన్న్యాసయోగః

0 comments

జైశ్రీరామ్..

|| 5-5 ||

యత్సాఙ్ఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే|

ఏకం సాఙ్ఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి.

తే.గీ. సాంఖ్యు లేస్థానమును పొంది, సమ్మతిగను

చుందు రట్టిదే యోగులున్ పొందుదు రిల

సాంఖ్యయోగంబులొకటంచు సరసులు గను

చుందు రవ్వారి దృష్టియే శుద్ధమరయ.

భావము.

సాంఖ్యులచేత ఏస్థానం పొందబడుతుందో, ఆస్థానమే యోగులుచేత 

పొందబడుతుంది. సంఖ్య యోగాన్ని ఒకటిగా ఎవరు చూస్తున్నారో వాళ్ళే 

నిజమైన దృష్టి కలిగిన వారు.

|| 5-6 ||

సన్న్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః|

యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్ఛతి.

తే.గీ. కర్మయోగ దూరులకిల కష్టమగును

కర్మసన్న్యా సాధన, కర్మయోగు

లనతికాలమునను బ్రహ్మమంద గలరు,

తేలికగనే మహాబాహు! తెలియుమిదియు.

భావము.

ఓ మహాబాహో! కర్మయోగం చెయ్యని వాళ్ళకు కర్మసన్యాసాన్ని 

సాధించడం కష్టం. కర్మ యోగంతో కూడిన మానవుడు త్వరలోనే 

తేలికగా బ్రహ్మమును చేరుకుంటాడు.

జైహింద్.

20, ఏప్రిల్ 2022, బుధవారం

జ్ఞేయః స నిత్యసంన్యాసీ..|| 5-3 ||..//..సాఙ్ఖ్యయోగౌ పృథగ్బాలాః..|| 5-4 ||..//..పఞ్చమోధ్యాయః - సంన్యాసయోగః

0 comments

జైశ్రీరామ్.

|| 5-3 ||

శ్లో. జ్ఞేయః స నిత్యసంన్యాసీ యో న ద్వేష్టి న కాఙ్క్షతి|

నిర్ద్వన్ద్వో హి మహాబాహో సుఖం బన్ధాత్ప్రముచ్యతే.

తే.గీ. కనగ నద్వేషియు విముక్త కాంక్షు డిలను

నిత్యసన్యాసి, కనుమిది నీవు పార్థ!

ద్వంద్వ భావరహితుడిట బంధముక్తు

డగును, నిజమిది భువిపైన సుగుణధామ!

భావము.

ఎవరైతే ద్వేషించకుండా, కాంక్షించకుండా ఉంటారో, అతడే 

నిత్యసన్యాసి అని తెలుసుకో. ఓ మహాబాహూ! ద్వందాలు లేనివాడే 

బంధాల నుండి తేలికగా విడుదల పొందుతాడు.

|| 5-4 ||

శ్లో. సాఙ్ఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదన్తి న పణ్డితాః|

ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విన్దతే ఫలమ్.

తే.గీ. సాంఖ్య మని యోగ మని యంద్రు చంటివా

పెద్దలట్టుల పల్కరు విజ్ఞులగుట

నెవ్వరారెంట నొకదాని నెన్ని నిలుతు

రట్టి వారికీ రెండును నమరు పార్థ!

భావము.

పసివారు (అజ్ఞానులు) మాత్రమే సాంఖ్యమూ, యోగమూ వేరు వేరు అని 

అంటారు. విద్వాంసులు అనరు. ఎవరైతే ఒకదానిలో సరిగా నిలబడ్డారో 

అతడికి రెండింటి ఫలం దొరుకుతుంది.

జైహింద్.

19, ఏప్రిల్ 2022, మంగళవారం

సంన్యాసం కర్మణాం కృష్ణ! ..|| 5-1 ||..//..సన్న్యాసః కర్మయోగశ్చ .|| 5-2 ||..,.//.. అథ పఞ్చమోధ్యాయః - సంన్యాసయోగః

0 comments

జైశ్రీరామ్.

 అథ పఞ్చమోధ్యాయః - సంన్యాసయోగః

|| 5-1 ||

అర్జున ఉవాచ|

భావము.

అర్జునుడు ఇలా అడిగాడు.

శ్లో. సంన్యాసం కర్మణాం కృష్ణ! పునర్యోగం చ శంససి|

యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్.

తే. కర్మసన్యాస మొకపరి, కర్మయోగ

మొకపరి ప్రశంసితములయ్యె, నొక్కదాని

నిందు ఘనమైనదేదియో ముందు తెలుపు

మయ్య! శ్రీకృష్ణుడా!యనె నర్జునుండు.

భావము.

ఓ కృష్ణా ఒకసారి కర్మ సన్యాసాన్ని, మరొకసారి కర్మ యోగాన్ని 

పొగుడుతున్నావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో దానిని నాకు తెలుపుము.

|| 5-2 ||

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీ కృష్ణుడన్నాడు.

శ్లో. సన్న్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయస కరావుభౌ|

తయోస్తు కర్మసంన్యాసాత్కర్మయోగో విశిష్యతే

తే.గీ. కర్మసన్యాసము మరియు కర్మ యోగ

ము ఘనమైన వానందదము లరయగ ను,

కర్మసన్యాసమే మేలు కర్మయోగ

ము సరి కాదు దానికి చూడ ముక్తిదమది.

భావము.

కర్మసన్యాసమూ, కర్మయోగమూ రెండూ కూడా ఉత్తమమైన ఆనందానికి 

తీసుక వెళతాయి. ఐతే ఈ రెండింటిలో కర్మ యోగము కర్మసన్యాసము 

కంటే మెరుగైనది.

జైహింద్.

18, ఏప్రిల్ 2022, సోమవారం

యోగసంన్యస్త కర్మాణం..|| 4-41 ||..//..తస్మాదజ్ఞాన సమ్భూతం.. || 4-42 ||..//..జ్ఞాన కర్మ సన్యాస యోగము.

0 comments

జైశ్రీరామ్.

|| 4-41 ||

శ్లో. యోగసంన్యస్త కర్మాణం జ్ఞానసఞ్ఛి న్నసంశయమ్|

ఆత్మవన్తం న కర్మాణి నిబధ్నన్తి ధనఞ్జయ.

తే.గీ. యోగమునకర్మలన్ వీడు యుక్తిపరుని,

జ్ఞానమున సంశయచ్ఛేద ఘనుని యాత్మ

ని‌ష్టు నే కర్మలున్ గట్ట నేర విలను,

పార్థ! గ్రహియింపుమిదినీవు పట్టుపట్టి.

భావము.

అర్జునా! యోగం వలన కర్మలను వదిలించుకొని, జ్ఞానం వలన 

సంశయాలను నివృత్తి చేసుకున్న ఆత్మ నిస్టుడిని కర్మలు బంధించలేవు.

 || 4-42 ||

శ్లో. తస్మాదజ్ఞాన సమ్భూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః|

ఛిత్త్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత.

తే.గీ. ఆత్మ సు జ్ఞాన ఖడ్గాన నసదృశముగ

నీదు సంశయముల్ నీవు నేర్పు మీర 

ఛేదనము చేసి యోగంబు చేయబూను

మర్జునా! లేచి నిలబడుమభయమిత్తు.

భావము.

అందుచేత అజ్ఞానం వలన జనించి నీ హృదయంలో ఉన్న సంశయాన్ని 

ఆత్మజ్ఞానమనే ఖడ్గంతో ఛేదించి, యోగాన్ని అవలంబించు.అర్జునా

లేచి నిలబడు.

జైహింద్.

16, ఏప్రిల్ 2022, శనివారం

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం..|| 4-39 ||..//..అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ..|| 4-40 ||..//..జ్ఞాన కర్మ సన్యాస యోగము.

0 comments

జైశ్రీరామ్.

|| 4-39 ||

శ్లో.  శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేన్ద్రియః|

జ్ఞానం లబ్ధ్వా పరాం శాన్తి మచిరే ణాధిగచ్ఛతి.

తే.గీ.. శ్రద్ధ నింద్రియ నిగ్రహ జాణ యగుచు,

తనదు జ్ఞానానుభూతినే తనదు లక్ష్య

ముగను కలిగినవాడిల పొందు జ్ఞాన

దీపితంబగుననుభూతి దేలు శాంతి.

భావము.

శ్రద్ధతో ఇంద్రియ నిగ్రహాన్ని కలిగివుండి, జ్ఞానానుభవాన్ని లక్ష్యంగా 

పెట్టుకున్న సాధకుడు ఈ 

|| 4-40 ||

శ్లో. అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి|

నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః.

తే.గీ. జ్ఞానమున్ శ్రద్ధ కొరవడ్డ సంశయాత్ము

డునశియించిహము పరము గనగలేడు,

సుఖము పొందగ లేడిల చూడగాను,

నీవు గ్రహియింపుమర్జునా! నేర్పు మీర.

భావము.

జ్ఞానం, శ్రద్ధ కొరవడిన సంశయాత్ముడు నశించును. సంశయంలో 

పడ్డవాడికి ఈ లోకంలేదు. పరలోకమూ లేదు. సుఖం కూడా లేదు.

జైహింద్.

14, ఏప్రిల్ 2022, గురువారం

మా యింటికి వచ్చిన శివ కేశవులు.

0 comments

జై శ్రీరామ్.

ఆర్యులారా!  అమ్మవారి నామం అనంతపుణ్య ఫలదం. అమ్మవారు 

నూట ఎనిమిది  అశ్వధాటీ వృత్తములలో శతకముగా ఒక్క రోజులో 

నా రచనను కారణంగా చూపి 

ఆవిర్భవించారు. ఆ అశ్వధాటీ వృత్తములను అత్యంత భక్తిభావముతో 

గానామృతంగా మనకు అందించుచున్న 

శ్రీ కుమార సూర్యనారాయణ గారు. నిన్న మా గృహమునకు విచ్చేశారు. 

వీరు ప్రముఖ సినీ సంగీత 

దర్శకులు. మహా భక్తులు..వీరిని ఈ విధంగా గౌరవించుకొనే భాగ్యం 

ఆ జగజ్జనని నాకు లభింపజేశారు.

శ్రీ కుమార సూర్యనారాయణ గారు నా చేతి సత్కారాన్ని 

అంగీకరించి స్వీకరించినందులకు ధన్యవాదములు.

శ్రేయము గొల్పు సద్గుణులు, చిన్మయ తేజులు, భవ్య గాత్ర స

ఛ్శ్రీయుతలైన మాన్యగుణ శేముషినొప్పు  కుమార సూర్యనా

రాయణ సద్వరేణ్యులు పరంబునిహంబును గొల్ప వచ్చినా 

రాయమ గౌరి పంపగ సు మాంజలి జేసెద వారికిత్తరిన్.

వీరి మిత్రులు శ్రేయము గొల్పు సద్గుణులు, చిన్మయ తేజులు, భవ్య గాత్ర స


ఛ్శ్రీయుతలైన మాన్యగుణ శేముషినొప్పు  కుమార సూర్యనా

రాయణ సద్వరేణ్యులు పరంబునిహంబును గొల్ప వచ్చినా 

రాయమ గౌరి పంపగ సు మాంజలి జేసెద వారికిత్తరిన్. కూడా నేను 

మా యింటికిరావలసినదిగా ఆహ్వానించగానే అభిమానంతో అంగీకరించి,

వచ్చి మాకెంతో ఆనందం కలిగించారు, వీరు. ప్రముఖ 

వేణు గాన పండితులు, రమారమి తొంభై శాతం సినీమాలకు వేణుగానాన్ని 

అందించినవారు.  వీరు కూడా నా చేతి సత్కారమును 

అభిమానంతో అంగీకరించి స్వీకరించినందులకు మాకెంతో 

సంతోషం కలిగించారు. 

శ్రీ నందుల శ్రీనివాస్ గారు నా చేతి సత్కారమును అభిమానంతో

 అంగీకరించి స్వీకరించినందులకు ధన్యవాదములు.

నందుల శ్రీనివాస్ హితు లనంతుడె మెచ్చెడి వేణుగానమున్

డెందము పొంగ చేయుచు వడిన్ మన చిత్తము కొల్లగొట్టు, నా

నంద సుధాబ్ధి దేల్చు కరుణారససాగరు డేగుదెంచె, మా

కందరికిన్ ముదంబునిడె, గణ్యులు, వీరల కంజలించెదన్.

జైహింద్.

యథైధాంసి సమిద్ధోగ్నిర్భస్మ..|| 4-37 ||..//..న హి జ్ఞానేన సదృశం ..|| 4-38 ||..//..జ్ఞాన కర్మ సన్యాస యోగము.

0 comments

జైశ్రీరామ్.

|| 4-37 ||

శ్లో. యథైధాంసి సమిద్ధోగ్నిర్భస్మసాత్కురుతేऽర్జున|

జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా.

తే.గీ. కట్టెలను కాల్చు జ్వలితాగ్ని, యట్టులేను

జ్ఞాన రూపాగ్ని కర్మలన్ గాల్చివేయు,

ఘనతరంబగు జ్ఞాన సంస్కారి వగుమ,

కర్మలన్ బాసి శుభములే కనుము నీవు.

భావము.

అర్జునా జ్వలించే అగ్ని కట్టెలను కాల్చినట్లుగా, జ్ఞానమనే అగ్ని 

కర్మలను కాల్చివేస్తుంది.

|| 4-38 ||

శ్లో. న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే|

తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విన్దతి.

తే.గీ. జ్ఞాన మట్లు పవిత్రమై కలుగదన్య

మరయ, నిజమిది, సుజ్ఞాని నిరుపమముగ

పొందు తనలోనె జ్ఞాన మున్, సుందరముగ,

నీవునట్టులే పొందనౌ నెర్పుమీర.

భావము.

జ్ఞానం లాగ పవిత్రమైనది ఇంకొకటి లేదు.యోగ సంసిద్దిని పొందినవాడు 

దానిని కాలక్రమేణా తనలోనే పొందుతాడు.

జైహింద్.

13, ఏప్రిల్ 2022, బుధవారం

యజ్జ్ఞాత్వా న పునర్మోహ.. || 4-35 ||..//..అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః..|| 4-36 ||..//..జ్ఞాన కర్మ సన్యాస యోగము.

0 comments

జైశ్రీరామ్.

 || 4-35 ||

శ్లో. యజ్జ్ఞాత్వా న పునర్మోహ మేవం యాస్యసి పాణ్డవ|

యేన భూతా న్యశేషాణి ద్రక్ష్య స్యాత్మ న్యథో మయి.

తే.గీ. ఏది పొందిన మోహాననెపుడు పడవొ,

యేది పొందిన నీలోన నెన్ని చూడ

గలవొ జీవులన్ నాలోన ఘనతరముగ

పొందుమా దానినే నీవు కుందనేల?

భావము.

అర్జునా! దేనిని పొందాక తిరిగి ఇలా మోహంలో పడవో, దేని చేత 

అశేషమైన జీవరాశుల్ని నీలోను, నాలోను చూడగలుగుదువో 

ఆ జ్ఞానాన్ని పొందు.

|| 4-36 ||

శ్లో. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాప కృత్తమః|

సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సన్తరిష్యసి.

తే.గీ. పాపు లందరిలో మహా పాపివయిన

జ్ఞాన మనియెడి పడవలో ఘనతరముగ

పాపమును దాటగల వీవు పట్టుపట్టి,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.

భావము.

పాపులందరిలోకి ఎక్కువ పాపం చేసిన వాడివైనా పాపాన్నంతటినీ 

జ్ఞానమనే పడవతో దాటగలవు.

జైహింద్.

12, ఏప్రిల్ 2022, మంగళవారం

. శ్రేయా న్ద్రవ్య మయా ద్యజ్ఞా..|| 4-33 ||..//.. తద్విద్ధి ప్రణిపాతేన ..|| 4-34 ||..//..జ్ఞాన కర్మ సన్యాస యోగము.

0 comments

జైశ్రీరామ్.

|| 4-33 ||

శ్లో. శ్రేయా న్ద్రవ్య మయా ద్యజ్ఞా జ్జ్ఞాన యజ్ఞః పరన్తప|

సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే.

తే.గీ. ద్రవ్యమున జేయు యజ్ఞంబు భవ్య మవదు 

జ్ఞాన యజ్ఞంబు కన్నను కనగ పార్థ!

జ్ఞాన యజ్ఞంబు గొప్పది కలియునన్ని 

రకముల ఫలితంబు లందె కలుగు.

భావము.

అర్జునా! పరంతపా! ద్రవ్యంతో చేసే యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞం శ్రేష్టమైనది. 

అన్ని రకాల కర్మలూ జ్ఞానంలో లీనమౌతాయి.

|| 4-34 ||

శ్లో. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా|

ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వ దర్శినః.

తే.గీ. జ్ఞాన మాత్మార్పణము, సేవ, ధీనిధువను

ప్రశ్నవేయుట వలనను, పార్థ! యెరుగు

మాత్మ తత్వజ్ఞు లది నీకు నాదరముగ

బోధ జేయుదురది నీకు బొధపడగ.

భావము.

జ్ఞానాన్ని ఆత్మార్పణ భావం, సేవ, ప్రశ్నించడం ద్వారా తెలుసుకో, జ్ఞానులు, 

తత్వవేత్తలూ ఐనవారు నీకు ఉపదేశిస్తారు.

జైహింద్.

11, ఏప్రిల్ 2022, సోమవారం

ప్రాచీన చమత్కార కథలు | అనులోమ విలోమ శ్లోకము.

3 comments

జైశ్రీరామ్.
జైహింద్.

10, ఏప్రిల్ 2022, ఆదివారం

జగద్గిరి గుట్టలో శ్రీచైతన్య విద్యా నికేతన్ లో జరిగిన ఉగాది కవిసమ్మేళనము. ౦౯ . ౪ . ౨౦౨౨.

0 comments

జైశ్రీరామ్. 

ఘన శివరాత్రి యాదగిరి కార్యనిబద్ధత, సద్వివేకమున్,

మనమును పొంగ జేయు గన మాన్య మహోదయుడే గణింపగా,

సునిశిత దృష్టితో భవిత చూచుచు బాలల వృద్ధి నెంచుచున్

జనహితుడై చెలంగు విలసన్నుత మూర్తి జయంబులొందుతన్.


వచ్చు నుగాది యన్నపుడె వచ్చును యాద్గిరి గుర్తు నా కికన్

హెచ్చును సంతసంబు, కడు హెచ్చుగ పర్విడు సత్ కవిత్వమున్,

మెచ్చుట ధర్మ మీతనిని మెచ్చగు సత్ పదముల్   గణింపలేన్

మచ్చునకందు మాన్యుడని మాధవుడంచును మంచినెంచుచున్.


ధీనిధి, సద్గుణగణుడును

ప్రాణముగా ప్రజను గనుచు పాలన చేయున్,

మౌనముగా పని చేసెడి

యేనుగునరసింహరెడ్ఠి నెట్లుపొగడుదున్.


మలుగ అంజయ్య మహితుడు మధురసుకవి,

పద్యకవితాసుధారలన్ ప్రతిభుడితడు,

నిత్య సంతోష సన్మూర్తి, నిరుపమాన

సుగుణ పూర్ణుండు కవులకే శోభ యితడు.


శ్రీమన్మంగళ జానకీ సహితుఁడౌ శ్రీరామచంద్రుండు సత్

ప్రేమోద్భాసిత మిత్రమండలి ప్రజన్ విఖ్యాతిగా నేలుతన్.

మామీదన్ దయజూపుదైవమగు రామస్వామి ప్రేరేపణన్

ధీమంతుల్ వెలుగొందుతన్ శుభకృతున్, ధీశక్తినే జూపుచున్.


శుభకృద్వత్సరభాగ్యరాశి ప్రజలన్ శోభిల్లఁ జేయంగ తా

నభయంబిచ్చుచు వచ్చె నేడు, ప్రజ మోహాతీత సద్భాగ్యులై

ప్రభలన్ లోకమునందు గొల్పుచు, సదా ప్రఖ్యాతితో వెల్గుతన్,

సభలోనున్న జనాళిమంగళములన్ సంస్తుత్యులై పొందుతన్.


వచ్చె వసంత లక్ష్మి, వరభావ స్మృద్ధిని గొల్పి చూపగాన్,

మెచ్చగ సత్కవీశ్వరులు మేలగు జీవన మార్హమీయగా, 

సచ్చరితాత్ములన్ గనుచు చక్కగ కావగ నెల్ల వేళలన్,

సచ్చరితంబుతో జనులు చక్కగ మెల్గుచు శోభగాంచెడిన్.  


జ్ఞానాబ్ధియౌ శుభకృ తానంద వత్సరము దీనాళి కల్పతరువై

జ్ఞానంబు, సద్ధనము, రాణింపు గొల్పుచు నిధానంబుగా నిలుచుతన్,

ప్రాణంబుగా కనుచు తా నీడగా నిలిచి, మానాభిమాన ధనముల్

క్షోణిన్ కృపన్ గొలిపి, ప్రణంబులన్ నిలుపు, నీనాటి నుండియు నిఁకన్ 


వర మంగళ భావన భాగ్యముతో

నిరతంబు పరాత్పరి నిల్పు ప్రజన్,

కరు ణాకరమౌ శుభ కాల గతిన్

మురిపించుచు మంగళముల్గొలుపున్.

జైహింద్.

ప్రాచీన సాహిత్యం.

0 comments

జైశ్రీరాం.
జైహింద్.

భగవద్బంధువులగు మీ అందరికీ శ్రీరామ నవమి సందర్భముగా శుభాకాంక్షలు.💐

0 comments

 జై శ్రీరామ.🙏

భగవద్బంధువులగు మీ అందరికీ శ్రీరామ నవమి సందర్భముగా శుభాకాంక్షలు.💐

శ్రీసంభాస విశిష్ట భావ మహితుల్ శ్రీ భారతిన్ మీర లా

శ్రీసీతారఘురామచంద్రులొకటై శ్రేయంబులన్ గూర్చు, మీ

ధ్యాసన్ నిల్పి భజించు డీ మదులలో నా జానకీ రాములన్, 

మీ సన్మార్గమె మీకు సద్వరమగున్, మేలున్ భువిన్ గాంచుడి.

మీకు శ్రీరామ రక్ష.

👍🙏

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

యజ్ఞశిష్టామృత భుజో యాన్తి.. || 4-31 ||..//..ఏవం బహువిధా యజ్ఞా వితతా..|| 4-32 ||..//...జ్ఞాన కర్మ సన్యాస యోగము.

0 comments

జైశ్రీరామ్. 

  || 4-31 ||

శ్లో. యజ్ఞశిష్టామృత భుజో యాన్తి బ్రహ్మ సనాతనమ్|

నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోऽన్యః కురుసత్తమ.

తే.గీ. యజ్ఞ శేషాన్నమమృతమో యర్జునుండ! 

యజ్ఞ దూరుల కిహమె లే దరసి చూడ

పర మదెట్టులబ్బును కనన్ పార్థ!, నిజము.

యజ్ఞములు చేయవలయునేమైనకాని.

భావము.

అర్జునా! యజ్ఞమున సమర్పించగా మిగిలిన ఆహారం అమృతము. యజ్ఞము 

చేయని వారికి ఈ లోకమేలేదు, పరలోకమెక్కడ?

|| 4-32 ||

శ్లో. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే|

కర్మజాన్విద్ధి తాన్సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే.

తే.గీ. ఈ విధంబుగ యజ్ఞము లెన్నియో వి

ధములు వేదముల్  వివరించె, ధరను కర్మ

జనితముల్ కను, వరముక్తి కను మ దెరిగి,

నిజమెరుంగుమోయర్జునా విజయము గన.

భావము.

ఈ విధంగా అనేక విధాల యజ్ఞాలు వేదాలలో విస్తరించబడి ఉన్నాయి. అవి 

అన్నీ కర్మల వలన జనిస్తాయని తెలుసుకో. ఇలా తెలుసుకుంటే విముక్తుడవు అవుతావు.

జైహింద్.

9, ఏప్రిల్ 2022, శనివారం

అపానే జుహ్వతి ప్రాణం.. || 4-29 ||..//..అపరే నియతాహారాః .. || 4-30 ||..//..జ్ఞాన కర్మ సన్యాస యోగము.

0 comments

జైశ్రీరామ్. 

|| 4-29 ||

శ్లో. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తథాపరే|

ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామపరాయణాః.

తే.గీ. శ్వాస నల నిరోధించి, యపానమునకు

బ్రాణమున్, బ్రాణమునకు నపాన మెన్ని

యాహుతుల్ చేయుదురు కొంద రనుపము లిల,

నీవు గ్రహియింపుమిద్దియు నిర్మలాత్మ!

భావము.

అలాగే ప్రాణాయామ పరాయణులైన మరి కొందరు ఉచ్వాస 

నిచ్వాసములను నిరోధించి, అపానానికి ప్రాణాన్ని, ప్రాణాన్ని అపానానికి, 

ఆహుతులుగా అర్పిస్తారు.

 || 4-30 ||

శ్లో. అపరే నియతాహారాః ప్రాణాన్ప్రాణేషు జుహ్వతి|

సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః.

తే.గీ. పరిమితాహారుల్ ఘనుల్ ప్రాణమునకు

బ్రాణ మాహుతి యొనరింత్రు, వారు యజ్ఞ 

విదులె, కల్మషంబులనిట వీడుచుంద్రు

యజ్ఞములచేత, నిజమిది యరయుమీవు.

భావము.

మరికొందరు నియమితమైన ఆహారాన్ని స్వీకరిస్తూ, ప్రాణాన్ని ప్రాణానికి 

ఆహుతులుగా అర్పిస్తారు. వీరందరూ యజ్ఞానాలను ఎరిగినవారే. యజ్ఞం 

వలన కల్మషాలను హరింప చేసుకుంటారు.

జైహింద్.

8, ఏప్రిల్ 2022, శుక్రవారం

శ్రీ రంగనాయక పాదుకా సహస్రం లో ఏకాక్షర శ్లోకము | SWADHARMAM

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

|శివ కర్ణామృతం అనే గ్రంథములో గోమూత్రికాబంధము.| SWADHARMAM

0 comments

జైశ్రీరామ్. 
జైహింద్.

సర్వాణీన్ద్రియకర్మాణి .. || 4-27 ||..//..ద్రవ్య యజ్ఞా స్తపో యజ్ఞా..|| 4-28 ||..//..జ్ఞాన కర్మ సన్యాస యోగము.

0 comments

 జైశ్రీరామ్.

|| 4-27 ||

శ్లో. సర్వాణీన్ద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే|

ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే.

తే.గీ. జ్ఞాన, కర్మేంద్రియంబుల కర్మములను

సంయమాగ్నిలో వేల్తురు సంయమివరు

లిట్లు కొంద ర, రయు మిదియె ఘనము గన,

ఆత్మసంయమనంబది యనుపమమిట.

భావము.

మరి కొందరు జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ కర్మ లన్నింటిని జ్ఞానంతో 

వెలిగింప బడిన మన స్సంయమన మనే అగ్నిలో వేల్చుతారు.

|| 4-28 ||

శ్లో. ద్రవ్య యజ్ఞా స్తపో యజ్ఞా యోగయ జ్ఞాస్తథాపరే|

స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః.

తే.గీ. కఠిన యత్నంబుతో ఘనుల్ జ్ఞాన, ద్రవ్య,

యోగ, స్వాధ్యాయ, సత్తపో యుక్త యజ్ఞ

ములను కల్గి యుందురిలను పూజ్యముగను,

నీవు గ్రహియింపుమర్జునా! నియతితోడ.

భావము.

మరికొందరు కఠినమైన నియమాలతో ప్రయత్నం చేస్తూ ద్రవ్య, తపో, 

యోగ, స్వాధాయ, జ్ఞాన యజ్ఞాలు కలిగి ఉన్నారు.

జైహింద్.


7, ఏప్రిల్ 2022, గురువారం

శ్లో. దైవమేవాపరే యజ్ఞం ..|| 4-25 ||..//..శ్లో. శ్రోత్రాదీనీన్ద్రియాణ్యన్యే.. || 4-26 ||..//..జ్ఞాన కర్మ సన్యాస యోగము.

0 comments

జైశ్రీరామ్.

|| 4-25 ||

శ్లో. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే|

బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి.

తే.గీ. దైవ యజ్ఞమున్ కొందరు ధరణి జేయు,

బ్రహ్మ మన నగ్ని కర్పిత బ్రహ్మలగుదు

రిలను కొందరీ యజ్ఞమున్ సలలితముగ,

నాత్మ సుజ్ఞాని కర్థమౌ నరయు మీవు.

భావము.

కొందరు యోగులు దైవ యజ్ఞాన్నే చక్కగా చేస్తారు. కొందరు బ్రహ్మమనే 

అగ్నిలో యజ్ఞం ద్వారా యజ్ఞాన్ని (తనలోని జీవభావాన్ని) అర్పిస్తారు.

 || 4-26 ||

శ్లో. శ్రోత్రాదీనీన్ద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి|

శబ్దాదీన్విషయానన్య ఇన్ద్రియాగ్నిషు జుహ్వతి.

తే.గీ. నిగ్ర హాగ్నిలో వేల్త్రు సమగ్రముగను 

కొందరు శ్రవణాదీంద్రియాల్, కొంద రింద్రి

యాగ్నిలోవేల్తురు శ్రవణమాదిగ గల

తృష్ణలన్, దీర్చుకొనుటకు, తెలివి మాలి.

భావము.

శ్రవణం మొదలైన ఇంద్రియాలను కొందరు నిగ్రహమనే అగ్నిలో వేల్చుతారు. 

మరి కొందరు ఇంద్రియము అనే అగ్నిలో శబ్ధాది విషయాలను వేల్చుతారు.

జైహింద్.

6, ఏప్రిల్ 2022, బుధవారం

యది హ్యహం న వర్తేయం..|| 4-23 ||..//..ఉత్సీదేయురిమే లోకా..|| 4-24 ||..//.. జ్ఞాన కర్మ సన్యాసయోగః

0 comments

జైశ్రీరామ్.

  జ్ఞాన కర్మ సన్యాసయోగః

|| 4-23 ||

శ్లో. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతన్ద్రితః|

మమ వర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః.

తే.గీ. నేను విశ్రాంతియే లేక నిరతము పని

చేయకున్నచో మనుజులే చేయుదు రయ

నాదు మార్గంబునే గొని మోదమలర,

నీవు గ్రహియింపు మర్జునా నిజమునెపుడు.

భావము.

అర్జునా! నేను విశ్రాంతి లేకుండా నిరంతరం పని చేయకపోతే, మనుష్యులు 

అన్ని విధాల నా మార్గమే అనుసరిస్తారు.

|| 4-24 ||

శ్లో. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్|

సఙ్కరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః.

తే.గీ. కర్మలన్ నేను విడువ లోకములు నశ్య

మగును, గన వర్ణసంకరం బగును, కార

ణ మిట నేనే యగుదును, మనమున గనిన

ప్రజవినాశన కారినై పాపినగుదు.

భావము.

నేను కర్మలు చేయకపోతే ఈలోకాలన్నీ నశించి పోతాయి. వర్ణ సంకరానికి 

కారకుడనౌతాను. ఈ ప్రజలను నాశనం చేసిన వాడనౌతాను.

5, ఏప్రిల్ 2022, మంగళవారం

ఆంధ్ర పద్యకవితా సదస్సు - సాహిత్యోపన్యాసం. వక్త: శ్రీ బులుసు వెంకటేశ్వర్ల...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

సాహితీసంస్కృతులకద్దంపట్టే ప్రాచీన సాహిత్య కథలు |

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

ప్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జరిపించిన శుభకృత్ ఉగాది కవిసమ్మేలనం.KAVI SAMMELAN (UGADI 2022) - Friends Welfare Association

2 comments

జైశ్రీరామ్.
జైహింద్.

నిరాశీర్యతచిత్తాత్మా..|| 4-21 ||..//..యదృచ్ఛాలాభ సన్తుష్టో ..|| 4-22 ||..//.. జ్ఞాన కర్మ సన్యాసయోగః

0 comments

 జైశ్రీరామ్.

 జ్ఞాన కర్మ సన్యాసయోగః

|| 4-21 ||

శ్లో. నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః|

శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్.

తే.గీ.  ఆశయే లేక దేహమ్ము ననుపమగతి

నిగ్రహించి, పరిగ్రాహి నేనటంచు

తలప కెవ్వండు చేయునో తనువున పని,

పొంద డెట్టి పాపంబులు, భువిని పార్థ!

భావము.

ఆశలేక, మన శరీరాలను నిగ్రహించి, అన్నిటి యందు పరిగ్రహ భావాన్ని 

వదిలి, కేవలం శరీరంతో కర్మ చేసేవాడు ఏ పాపాన్నీ పొందడు.

|| 4-22 ||

శ్లో. యదృచ్ఛాలాభ సన్తుష్టో ద్వన్ద్వాతీతో విమత్సరః|

సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే.

తే.గీ. ప్రాప్త మగునదే ఘనమని పరవసించచి,

ద్వంద్వమునకు నతీతుడై వరలుచుండి,

మత్సరములేక, ఫలితంబు మంచిది కని

పొంగకన్ కర్మ సలుప నసంగు డతడు.

భావము.

యాదృచ్చికంగా లభించిన దానితో సంతృప్తుడై, ద్వందాలకు అతీతుడై, 

మాత్సర్యం లేకుండా, ఫలం లభించినపుడు కూడా సమంగా ఉండేవాడు 

కర్మ చేసినా బద్ధుడు కాడు.

జైహింద్.

4, ఏప్రిల్ 2022, సోమవారం

యస్య సర్వే సమారమ్భాః..|| 4-19 ||..//..త్యక్త్వా కర్మఫలాసఙ్గం..|| 4-20 ||..//.. జ్ఞాన కర్మ సన్యాసయోగః

0 comments

 జైశ్రీరామ్.

 జ్ఞాన కర్మ సన్యాసయోగః

|| 4-19 ||

శ్లో. యస్య సర్వే సమారమ్భాః కామ సఙ్కల్ప వర్జితాః|

జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పణ్డితం బుధాః.

తే.గీ. కామ సంకల్ప రహితుడై కర్మల నిల

చేయు ప్రారంభమెవ్వరు ధ్యేయమలర

జ్ఞాన దగ్ధ కర్ముని వాని గాంచిన ఘనులు

సద్వివేకిగా ఘనులెంత్రు కొనుము పార్థ! 

భావము.

ఎవరు కామ సంకల్పం లేకుండా అన్ని కర్మలను చక్కగా ప్రారంభిస్తారో, జ్ఞానాగ్నిలో 

కర్మలన్నిటినీ కాల్చివేసిన అతణ్ణి వివేకి అని విద్వాంసులంటారు.

|| 4-20 ||

శ్లో. త్యక్త్వా కర్మఫలాసఙ్గం నిత్యతృప్తో నిరాశ్రయః|

కర్మణ్యభిప్రవృత్తోऽపి నైవ కిఞ్చిత్కరోతి సః.

తే.గీ. కర్మ ఫలబంధమును వీడి, కలిగి తృప్తి,

దేనిపైన ననాధారి యైనవాడు,

కర్మ మగ్ను డైనను కాని కర్మ చేయ

నట్టివాడే సుమా మది పెట్టి చూడ.

భావము.

కర్మ ఫలంతో సంగాన్ని వదిలి నిత్యతృప్తుడై దేనిమీద ఆధారపడని వాడై, 

కర్మలలో నిమగ్నుడై ఉండేవాడు ఏకర్మనీ చేయని వాడే అవుతాడు.

జైహింద్.

3, ఏప్రిల్ 2022, ఆదివారం

ఈ రోజు సాయంత్రము చందా నగర్ లో శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణమున జరిగిన ఉగాది కవిసమ్మేలన కార్యక్రమ ఛాయాచిత్రములు.

0 comments

 

నా కవితా గానం.

శ్రీమన్మంగళ జానకీ సహితుఁడౌ శ్రీరామచంద్రుండు సత్
ప్రేమోద్భాసిత మిత్రమండలి ప్రజన్ విఖ్యాతిగా నేలుతన్.
మామీదన్ దయజూపుదైవమగు రామస్వామి ప్రేరేపణన్
ధీమంతుల్ వెలుగొందుతన్ శుభకృతున్, ధీశక్తినే జూపుచున్.

శుభకృద్వత్సరభాగ్యరాశి ప్రజలన్ శోభిల్లఁ జేయంగ తా
నభయంబిచ్చుచు వచ్చె నేడు, ప్రజ మోహాతీత సద్భాగ్యులై
ప్రభలన్ లోకమునందు గొల్పుచు, సదా ప్రఖ్యాతితో వెల్గుతన్,
సభలోనున్న జనాళిమంగళములన్ సంస్తుత్యులై పొందుతన్.

వచ్చె వసంత లక్ష్మి, వరభావ స్మృద్ధిని గొల్పి చూపగాన్,
మెచ్చగ సత్కవీశ్వరులు మేలగు జీవన మార్హమీయగా, 
సచ్చరితాత్ములన్ గనుచు చక్కగ కావగ నెల్ల వేళలన్,
సచ్చరితంబుతో జనులు చక్కగ మెల్గుచు శోభగాంచెడిన్.  

జ్ఞానాబ్ధియౌ శుభకృ తానంద వత్సరము దీనాళి కల్పతరువై
జ్ఞానంబు, సద్ధనము, రాణింపు గొల్పుచు నిధానంబుగా నిలుచుతన్,
ప్రాణంబుగా కనుచు తా నీడగా నిలిచి, మానాభిమాన ధనముల్
క్షోణిన్ కృపన్ గొలిపి, ప్రణంబులన్ నిలుపు, నీనాటి నుండియు నిఁకన్ 

వర మంగళ భావన భాగ్యముతో
నిరతంబు పరాత్పరి నిల్పు ప్రజన్,
కరు ణాకరమౌ శుభ కాల గతిన్
మురిపించుచు మంగళముల్గొలుపున్.
స్వస్తి.


జైహింద్.



రమ్మా శుభకృత్ సుమమా...శ్రీ కొరిడె విశ్వనాథ శర్మ.

0 comments

జైశ్రీరామ్. 

రమ్మా శుభకృత్సమమా

✍️ కొరిడె విశ్వనాథ శర్మ


కం.

అమ్మా శుభకృత్సమమా

రమ్మా యిక నీ వసంత రంజచ్ఛోభన్

తెమ్మా యోగము క్షేమము

నిమ్మహి నింపగ సతతము నీశ్వరకృపతోన్


మత్తకోకిల.

కొమ్మ కొమ్మన చేరి కోయిల, కొత్త పూతల మేయుచున్

కమ్మగా మరి గొంతు నెత్తుచు, కొత్త రాగము పాడెనే

పొమ్మనంచును వీడుకోలును, పోయెడేటికిఁ జెప్పుచున్

రమ్ము రమ్మని కొత్త యేటికి రంజితంబుగ గూసెనే.


భౌమ్యసంగరదర్పనాశనమానసంబులనొప్పచున్ 

‌‌స్వామ్యకామ్యము వీడి దేశనృపాలవర్గము మెల్గుగాన్

సౌమ్యులై జనులందరొందగ సాధుజీవనమేర్పడన్

రమ్యమౌ శుభకృత్సు వత్సరరాజ ! చేయుమ లోకమున్.


వ్యాధిబాధలనిచ్ఛె శార్వరి యశ్రువుల్ జగమొందగాన్

వ్యాధిమాన్పి ప్లవాబ్ధి గూర్చెను స్వామ్యయుద్ధమునెల్లడన్

బాధలన్ గలిగింప బూనె సువత్సరంబులు జూడగా

సాధకంబిక నీవె లౌకిక శాంతి కై శుభకృత్సమా !


శుభకృత్తు ! జేయు మానిక

శుభాభివృద్ధియె జగంబు క్షోభను వీడన్

విభవముల గల్గ జేయుచు

ప్రభవిం చుమికనె పుడుర్వి వైరము వీడన్


శ్రీ శుభకృద్ వత్సరాది శుభాకాంక్షలతో

✍️ కొరిడె విశ్వనాథ శర్మ

ధర్మపురి. జగిత్యాల జిల్లా. తెలంగాణ.

2/4/22

జైహింద్.

శ్రీ శుభకృన్నామ వత్సర ఉగాది సందర్భముగా బీ.హె.చ్యీ.యల్.లో జరిగిన కవిసమ్మేలన చిత్ర మాలిక.

0 comments

 

జైశ్రీరామ్.
తే.02.4.2022 న
శ్రీ శుభకృన్నామ వత్సర ఉగాది సందర్భముగా బీ.హె.చ్యీ.యల్.లో జరిగిన కవిసమ్మేలన చిత్ర మాలిక.

శ్రీరస్తు....శుభమస్తు....ఽవిఘ్నమస్తు.
శ్రీమన్మంగళ శుభకృన్నామ వత్సర ఉగాది పర్వదినము సందర్భముగా అందరికె శుభాకాంక్షలు.
శ్రీ
శుభకృన్నామక వత్సరాది ప్రజలన్ శోభాయమానంబుగా 
నభయంబిచ్చి వెలుంగఁ జేయుఁ గృపతో నత్యంత ప్రీతాత్మయై,
శుభ సంకేతపు నామధారికద యీ శోభకృ దాద్యంతమున్,
విభవంబొప్పఁగ వెల్గుఁ గాత ప్రజ, దేవీపార్వతీ సత్కృపన్,

కం. బీహెచ్యీయెల్ల్ ప్రజలకు
మాహేశ్వరి కృపలభించి మంచిగ జరుగున్.
స్నేహోద్భాస జనావళి
మోహాదుల నధిగమించి పూజితులగుతన్.

వచ్చె వసంత లక్ష్మి, వరభావ స్మృద్ధిని గొల్పి చూపగాన్,
మెచ్చగ సత్కవీశ్వరులు మేలగు జీవన మార్హమీయగా, 
సచ్చరితాత్ములన్ గనుచు చక్కగ కావగ నెల్ల వేళలన్,
సచ్చరితంబుతో జనులు చక్కగ మెల్గుచు శోభగాంచెడిన్.  

జ్ఞానాబ్ధియౌ శుభకృ తానంద వత్సరము దీనాళి కల్పతరువై
జ్ఞానంబు, సద్ధనము, రాణింపు గొల్పుచు నిధానంబుగా నిలుచుతన్,
ప్రాణంబుగా కనుచు తా నీడగా నిలిచి, మానాభిమాన ధనముల్
క్షోణిన్ కృపన్ గొలిపి, ప్రణంబులన్ నిలుపు, నీనాటి నుండియు నిఁకన్ 

వర మంగళ భావన భాగ్యముతో
నిరతంబు పరాత్పరి నిల్పు ప్రజన్,
కరు ణాకరమౌ శుభ కాల గతిన్
మురిపించుచు మంగళముల్గొలుపున్..
స్వస్తి.
జైహింద్.


కర్మణో హ్యపి బోద్ధవ్యం..|| 4-17 ||..//..కర్మణ్యకర్మ యః పశ్యేద..|| 4-18 ||..//.. జ్ఞాన కర్మ సన్యాసయోగః.

0 comments

 జైశ్రీరామ్.

 జ్ఞాన కర్మ సన్యాసయోగః

|| 4-17 ||

శ్లో. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః|

అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః

తే.గీ. 

కర్మలను గూర్చెరుగవలె, కర్మలను వి

కర్మలను నకర్మలను ప్రగణితముగను

తెలుసుకొన వలె నర్జునా!తెలియ నవదు

కర్మల స్వభావ నిగూఢ ఘనత భువిని.

భావము.

కర్మల గురించి తెలుసుకొనవలెను. వికర్మల అకర్మల గురించి కూడా తెలుసు

కొనవలెను. కర్మల యొక్క స్వభావము చాలా నిగూఢమైనది.

|| 4-18 ||

శ్లో. కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి చ కర్మ యః|

స బుద్ధిమాన్మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్.

తే.గీ. కర్మలనకర్మను నకర్మ గర్మమునను

గాంచువాడె బుధుండిలన్, గాంచ యోగి

యతడు, కర్మ చేసిన ఘనుం డరయ భువిని,

యనుచునర్జునుతోకృష్ణు డనియె తెలియ.

భావము.

కర్మలో అకర్మనీ అకర్మలో కర్మనీ ఎవరు దర్శిస్తారో అతడు మనుష్యులలో 

అందరికంటే బుద్ధిమంతుడు. అతడే యోగి యావత్తు కర్మని పూర్తిగా చేసి

వాడవుతాడు.

జైహింద్.

2, ఏప్రిల్ 2022, శనివారం

శ్రీ శుభకృన్నామసంవత్సర ఉగాది సందర్భముగా మీకు నా శుభాకాంక్షలు.

0 comments

 జై  శ్రీమన్నారాయణ🙏

శుభోదయమ్.

శ్రీ శుభకృన్నామసంవత్సర ఉగాది సందర్భముగా మీకు నా శుభాకాంక్షలు.


కం.  శుభకృద్వత్సరమంతయు

శుభసంహతి మిమ్ము చేరి శోభను గూర్చున్

శుభకర లలితాంబ కృపను

విభవంబుల దేలడీరు, ప్రీతిగ మనుచున్.

💐🍎👍

చింతా రామకృష్ణారావు.

ఏవం జ్ఞాత్వా కృతం కర్మ..|| 4-15 ||..//..కిం కర్మ కిమకర్మేతి కవయో..|| 4-16 ||..//..జ్ఞాన కర్మ సన్యాసయోగః

0 comments

 జైశ్రీరామ్.

జ్ఞాన కర్మ సన్యాసయోగః

|| 4-15 ||

శ్లో. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః|

కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్.

తే.గీ. కర్మమొనరింప బడెను సకలమునరిగి,

పూర్వమున ముముక్షువులచే పూర్తిగా, మ

రటులె నిష్కామ కర్మంబు నరసి చేయు

మర్జునా! యంచు శ్రీకృష్ణుడనియె తెలియ.

భావము.

ఇది తెలుసుకొనియే పూర్వం ముముక్షువుల చేత కర్మ చేయబడినది.అందు 

వలన పూర్వీకుల చేత పూర్వం చేయబడినట్లే నీవు కూడా నిష్కామ కర్మనే చేయి.

|| 4-16 ||

శ్లో. కిం కర్మ కిమకర్మేతి కవయోऽప్యత్ర మోహితాః|

తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్జ్ఞాత్వా మోక్ష్యసేऽశుభాత్.

తే.గీ. ఏది కర్మయగు నకర్మ యేది యగు న

నుచు ఋషులును భ్రాంతులగుటను తెలియవలె,

నీ వశుభము నుండి విముక్తి నియతి నెరుగ

దెల్పెదను నీకు దాని ననల్ప సుగుణ!

భావము.

కర్మ ఏది అకర్మ ఏది అనెడి విషయములో ఋషులు సహితము భ్రాంతిలో 

పడుదురు. దేనిని  తెలుసుకొనిన నీవు అశుభము నుండి విముక్తి పొందుదువో 

ఆ కర్మ విషయము నీకు చెప్పెదను.

జైహింద్.

1, ఏప్రిల్ 2022, శుక్రవారం

గవీశపాత్రః అనేశ్లోకమున ఉన్న శివ విష్ణు పరమయిన అర్థ వివరణ..

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

ప్రాచీన సంస్కృత శ్లోకాలలో అపునర్యుక్త వ్యంజనము....చిత్రకవిత.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః ఆవిర్భావం కథ @ SAMSKRUTHA VAIBHAVAM

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

సంస్కృతములో సంభాషణము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

భారతీ తీర్థ మహాస్వామివారి సంస్కృతభాషా ప్రాశస్త్యమును గూర్చిన ప్రవచనము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

చాతుర్వర్ణ్యం మయా సృష్టం..|| 4-13 ||..//..న మాం కర్మాణి లిమ్పన్తి ..|| 4-14 ||..//..జ్ఞాన కర్మ సన్యాసయోగః

0 comments

 జైశ్రీరామ్.

జ్ఞాన కర్మ సన్యాసయోగః

|| 4-13 ||

శ్లో. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః|

తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్.

తే.గీ. గుణము కర్మంబులన్ నాలుగు విధములగు

వర్ణములు గొల్పినాడ నే వరలజేయ,

కాను సృష్టి జేసిన నేను కర్త ననియు,

మార్పు లేనివాడననియు మందిని గనుమ.

భావము.

నాలుగు విదాలైన వర్ణాలు గుణ కర్మల విభజనలను అనుసరించి నా వలన 

సృష్టించ బడ్డాయి. వాటిని సృష్టించిన వాడినైనా నేను కర్తను కాననీ, 

మార్పులేని వాడిననీ తెలుసుకో.

|| 4-14 ||

శ్లో. న మాం కర్మాణి లిమ్పన్తి న మే కర్మఫలే స్పృహా|

ఇతి మాం యోऽభిజానాతి కర్మభిర్న స బధ్యతే.

తే.గీ. నన్ను కర్మలంటవనియు, నాకు నెపుడు

కర్మ ఫల వాంఛ లేదని ఘనతరముగ

నెరుగు వాడు కట్టుబడడు వరలునట్టి

కర్మ ఫలముల చే పార్థ! కనుము నిజము.

భావము.

నన్ను కర్మలంటవనీ నాకు కర్మ ఫలముపై కోరిక లేదనీ ఎరిగినవాడు కర్మలచేత 

కట్టుబడడు.

జైహింద్.