గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జనవరి 2022, శనివారం

నిహత్య ధార్తరాష్ట్రాన్నః.. ||1-36||..//..తస్మాన్నార్హా వయం హన్తుం. ||1-37||..//..అర్జున విషాద యోగము.

 

జైశ్రీరామ్.

శ్లో.  నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన

పాపమేవాశ్రయేదస్మాన్హత్వైతానాతతాయినః ||1-36||

తే.గీ.  ధార్తరాష్ట్రులఁ జంపిన దాని వలన

సంతసంబేమికలుగును సన్నుతాత్మ!

ఆతతాయినం జంపిన నదియు మనకు

పాపఫలమునే యిచ్చును పరమపురుష!

భావము. 

జనార్ధనాదృతరాష్ట్ర కుమారులను చంపడం వలన మనకి ఏమి 

సంతోషం కలుగుతుంది?ఆతతాయులను చంపినా మనకి పాపమే 

వస్తుంది.                                                                                                                          

శ్లో.  తస్మాన్నార్హా వయం హన్తుం ధార్తరాష్ట్రాన్స్వబాన్ధవాన్ |

స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ||1-37||

తే.గీ. తలప ధార్తరాష్ట్రులఁ జంపఁ దగదు మనకు,

వారు బంధుసమేతులై వరలిరిచట

మన జనంబులన్ చంపిన మనమదెటుల

సుఖము పొందగలారము? సుజనపాల!,

భావము.

అందువలన బంధు సమేతులైన దార్తరాష్ట్రులను చంపడం తగదు

మన వాళ్ళను చంపడం వలన మనం ఎలా సుఖపడ గలము.

జైహింద్                                                                                                                     


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.