జైశ్రీరామ్.
శ్లో. కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః |
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తే௨హం శాధి మాం త్వాం ప్రపన్నమ్ || 7
కం. గురువులు బంధువులనుచును
దరగని మమకారమునను తరిగెను జ్ణానం
బరయుచు మార్గము చూపుము
గురువుగ నీ శిష్యునకునుగోవింద! కృపన్.
భావము.
గురువులూ బంధువులూ అనే మమకార దోషంవల్ల నాబుద్ధి
నశించింది. మంచి ఏదో చెడు ఏదో తెలియడం లేదు.
శిష్యుడిగా నిన్ను ఆశ్రయించిన నాకు
ఏది శ్రేయోమార్గమో దాన్ని ఆదేశించు.
శ్లో. న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్
యచ్ఛోక ముచ్ఛోషణమింద్రియాణామ్ |
అవాప్య భూమావసపత్నమృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ || 8
తే.గీ. ఆధిపత్యంబు భువిని నాకమరవచ్చు
అట్లె స్వర్గాధిపత్యమే యమరవచ్చు
నైనగానిస చ్ఛాంతి నాకమరఁబోవ
దలముకొనియున్న దుఃఖంబు తొలఁగిపోదు.
భావము.
భూలోకాధిపత్యం లభించినా, స్వర్గాధిపత్యం సిద్ధించినా
నా శోకం తగ్గుతుందనుకోను.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.