జైశ్రీరామ్.
శ్లో. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః |
జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ || 51
తే.గీ. భువి మనీషులు కర్మ జ పుణ్యపాప
ఫలములాశ చేయక కర్మ బంధనములు
విడిచి సన్ముక్తి నొంద భావింతు రటులె
చేయగాఁ దగుఁ బార్థుఁడా! సిద్ధమగుము.
భావము.
నిష్కామయోగులు కర్మఫలం ఆశించకుండా జన్మబంధాలనుంచి తప్పించుకుని,
ఉపద్రవంలేని మోక్షం పొందుతున్నారు.
శ్లో. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి |
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ || 52
తే.గీ. మోహ కలిలమున్నీ బుద్ధి పూర్తిగాను
దాటిపోవునో యప్పుడు తప్ప కీవు
వినఁబడిన వినదగినట్టి విషయములయె
డను విరక్తిని పొందుదువు నుతముగను
భావము.
నీ బుద్ధి అజ్ఞానమనే కల్మషాన్ని అధిగమించినప్పుడు నీకు విన్న విషయాలూ,
వినబోయే అర్థాలూ విరక్తి కలిగిస్తాయి.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.