జైశ్రీరామ్.
శ్లో. ఆచార్యాః పితరః
పుత్రాస్తథైవ చ పితామహాః |
మాతులాః
శ్వశురాః పౌత్రాః శ్యాలాః
సమ్బన్ధినస్తథా ||1-34||
తే.గీ. తండ్రులున్, మేన మామలు, తాతలు మరి
మామలున్,సుతులును,భావ
మరుదులు వర
లుదురు వియ్యంకు
లాచార్యులు మనుమలును
నిలిచి రిద్ధాత్రి
నిచ్చట న్నీవు కనుమ.
భావము.
ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, అలాగే తాతలూ, మేనమామలూ,
మామలూ, మనుమలూ, బావమరుదులూ, వియ్యంకులూ
మొదలైన వారు.
శ్లో. ఏతాన్న హన్తుమిచ్ఛామి
ఘ్నతోऽపి మధుసూదన |
అపి
త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం
ను మహీకృతే ||1-35||
తే.గీ. కనుమ మధుసూదనా! నీవు కరుణ వీడి
నన్నుఁ జంపినన్
గాని నే నెన్నటికిని
కల
త్రిలోకాధిపత్యంబు కలుగవచ్చు
చంపగాబోను,
భూమికై చంపఁగలన?
భావము.
మధుసూదనా; నేను చంపబడినప్పటికీ, త్రిలోక అధిపత్యానికైనా
వీరిని చంపడానికి ఇష్టపడను. ఇక భూలోక రాజ్యం కోసం
చంపుదునా.
జైహింద్
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.