జైశ్రీరామ్.
శ్రీభగవానువాచ
శ్రీకృష్ణభగవానుడిట్లనుచున్నాడు.
శ్లో. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః || 11
తే.గీ. నీవు దుఃఖించు చుంటివి నేడు పార్థ!
యవసరము లేని వారికై యనవసరము,
జ్ణాని వలె పల్కుచుంటివి చనిన, యున్న
వారికొఱకు దుఃఖింపరు ప్రతిభు లిలను.
భావము.
అర్జునా! దుఃఖించనవసరం లేనివాళ్ళకోసం దుఃఖిస్తున్నావు. పైగా
మహావివేకిలాగా మాట్లాడుతున్నావు. చచ్చిపోయినవాళ్ళ
గురించికాని, బ్రతికున్నవాళ్ళ గురించి కాని వివేకులు శోకించరు.
శ్లో. న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః |
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ || 12
కం. నీవును నేనును వీరును
భావింపగ యుందుముకద నేడును రేపున్
నీవేల తెలియకుంటివి?
నీవిది గ్రహియింప వలయు నేర్పరివగుచున్.
భావము.
నీవూ నేనూ వీళ్ళంతా గతంలోనూ వున్నాము. భవిష్యత్తులో
కూడా వుంటాము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.