జైశ్రీరామ్.
శ్లో. దేహినో௨స్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా |
తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి || 13
కం. జీవుని కిల కౌమారము
యౌవనవార్ధక్యములవి యరయుచు దేహం
బే వదలి మరల పుట్టును,
జీవముదుఃఖింపదుకద క్షితి నెన్నినచో.
భావము.
జీవుడికి ఈ శరీరంలో కౌమారం, యౌవనం, వార్థక్యం వచ్చినట్లే
మరణానంతరం మరో శరీరం వస్తుంది. ఇందుకు ధీరుడు
దుఃఖించడు.
శ్లో. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః |
ఆగమాపాయినో௨నిత్యాః తాం స్తితిక్షస్వ భారత || 14
తే.గీ. విషయవశమైన యింద్రియా లసదృశమగు
సుఖము దుఃఖములను తేలుచున్జరింప
వే,, యశాస్వత మింద్రియ విషయముల క
లయిక,బాధలనుసహించు ప్రియ నరుండ!
భావము.
కుంతీ పుత్రా! విషయాలకు వశమైన ఇంద్రియాలవల్ల
శీతోష్ణాది గుణాలూ,సుఖదుఃఖాలూ కలుగుతుంటాయి. కోరికలకూ,
ఇంద్రియాలకూ కలయిక అశాశ్వతం. కనుక ఓ భరతవీరా !
ఆ బాధలను సహించు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.