శ్లో. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ |
తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః || 37
తే.గీ. యుద్ధరంగంబులో మృతి యొసగు ముక్తి,
జయముపొందిన రాజ్యంపు సౌఖ్యమబ్బు,
నర్జునా యిది నీమది నరయవేల?
యుద్ధసన్నద్ధుఁడుగ నగు మొప్పుగాను
భావము.
అర్జునా ! ధర్మయుద్ధంలో మరణిస్తే స్వర్గం పొందుతావు. శత్రువులను
జయిస్తే రాజ్యభోగాలు అనుభవిస్తావు. అందువల్ల కృతనిశ్చయంతో
యుద్ధానికి నడుంబిగించు.
శ్లో. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జాయాజయౌ |
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి
|| 38
తే.గీ. సుఖము దుఃఖము నొకటిగ ఊడు పార్థ!
లాభనష్టంబుల గనవలయునటులనె,
అపజయంబైన జయమైన నటులె గనుము,
యుద్ధమునకు సన్నద్ధమై యొప్పుమయ్య.
భావము.
సుఖదుఃఖాలూ, లాభనష్టాలూ, జయాపజయాలూ సమానంగా భావించి
సమరం సాగించు. అప్పుడు నీకు పాపం కలగదు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.