జైశ్రీరామ్.
శ్లో. యం హి న వ్యథయన్త్యేతే పురుషం పురుషర్షభ |
సమదుఃఖసుఖం ధీరం సో௨మృతత్వాయ కల్పతే || 15
కం. పురుష శ్రేష్టుఁడ! యెవడిల
నిరుపమసుఖదుఃఖములు గణించు సమముగా
వెరపున ద్వంద్వములంటవు,
వరధీరుఁడతండమృతమువడయగనొప్పున్.
భావము.
పురుషశ్రేష్టుడా! సుఖదుఃఖాలలో సమంగా ఉండే ఏ ధీరుణ్ణి
ద్వందాలు భాదించవో అతడు అమృతత్వానికి అర్హుడు అవుతాడు.
శ్లో. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః |
ఉభయోరపి దృష్టో௨న్తః త్వనయో స్తత్త్వదర్శిభిః || 16
తే.గీ.లేనిదుండ దాయున్నది లేకపోదు
భువిని తత్వజ్ణులెఱుఁగుదురవి జగాన,
నీవు తత్వజ్ణుఁడవు పార్థ!భావనమున
తెలిసికొమ్మిది, నిజమును తెలియవలయు.
భావము.
లేనిది ఎప్పటికీ వుండదు. ఉన్నది ఎప్పటికీ లేకపోదు. ఈ రెండింటి
నిర్ణయం తత్వజ్ఞులకే తెలుస్తుంది.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.