జైశ్రీరామ్.
శ్లో. క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప || 3
తే.గీ. పొందకధైర్య మిటను నపుంసకునటు,
తగదు నీకిది, వీడుట తగు నధౌర్య
మునిక, హృదయపు దౌర్భల్యమును త్యజించు,
యుద్ధమునుచేయ నీవింక సిద్ధమగుము.
భావము.
నపుంసకుడిలాగ అధైర్యం పొందకు. ఇది నీకు పనికిరాదు,
మనోదౌర్బల్యం నీచం. దాన్ని విడిచిపెట్టు. నీవు శత్రుమర్దనుడవు
కదా! యుద్ధం ప్రారంభించు.
అర్జున ఉవాచ:
అర్జునుఁడు ఇట్లు పలికెను.
శ్లో. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన |
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన || 4
తే.గీ. మహిత మధుసూదనా!నేను మహితులయిన
ద్రోణ భీష్మాది యోధులతోరణమున
యుద్ధమెట్టులచేయుదు నుజ్జగించి
పెద్దలయెడగౌరవమును? వద్దువద్దు.
భావము.
అర్జునుడు : మధుసూదనా! పూజార్హులైన భీష్మ ద్రోణాదులను
బాణాలతో నేనెలా కొట్టగలను?
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.