జైశ్రీరామ్.
శ్లో. త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున |
నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ || 45
తే.గీ. వేదములుగుణత్రయముల ప్రీతిగొలుపు
కర్మకాండను వివరించు,గాన పార్థ!
తలఁ బోవకు వాటికై ద్వంద్వరహిత
శుద్ధ సత్వగుణుండవైశోభిలుమిల.
భావము.
అర్జునా ! వేదాలు సత్వ రజ స్తమములను మూడుగుణాలు కలిగిన
కర్మకాండలను వివరిస్తాయి. నీవు త్రిగుణాలనూ విడిచిపెట్టి,
ద్వంద్వాలు లేనివాడవై యోగక్షేమాలు కోరకుండా శుద్ధ
సత్వగుణం అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి.
శ్లో. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే |
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః || 46
ఎవరు వర నదీజలములకేగనెంత్రు
వారు బావినీటికొఱకు పోరు తెలియ,
భహ్మసుజ్ణానమరసెడివారుప్రతిఫ
లముల నిచ్చు వేదములకిల నరుగరుగ.
భావము.
నదినుంచి నీరుతెచ్చుకునేవాళ్ళు నూతికి ఎలా ప్రాముఖ్యమివ్వరో
అలాగే బ్రహ్మజ్ఞానులు ప్రతిఫలాపేక్షతో కూడిన వేదకర్మలకు ప్రాధాన్యం
ఇవ్వరు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.