జైశ్రీరామ్.
శ్లో. ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన |
నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ||1-44||
కం. కులధర్మమువీడిన
లో
కులు నరకము పొంది మిగుల కుములుదురటగా
కలకాలము,, వింటినటుల,
జలజాతేక్షణ! ముకుంద! సజ్జన పూజ్యా!
భావము.
జనార్ధనా కులధర్మాలు తొలగిపోయిన మనుష్యులు కలకాలం
నరక వాసులౌతారని విన్నాము.
శ్లో. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ |
యద్రాజ్యసుఖలోభేన
హన్తుం స్వజనముద్యతాః ||1-45||
ఆ.వె. అకట! రాజ్య సుఖమునాశించి
యిప్పుడు
స్వజనులను వధింప నిజముగానె
సిద్ధపడితిమికద, ఛీయెంత పాపంబు
చేయఁ బూనితిమిగ, శ్రీముకుంద!
భావము.
అకటా! రాజ్య సుఖం కోసం స్వజనాన్ని వధించడానికి సిద్ధమైన
మనం ఎంతటి మహాపాపానికి ఒడి గట్టుతున్నాము.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.