జైశ్రీరామ్.
శ్లో. గురూనహత్వాహి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే |
హత్వార్థకామాంస్తు గురూనిహైవ
భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ || 5
తే.గీ. మహితులైనట్టి గురువులన్ మడియఁ జేసి,
రక్తసిక్తంపురాజ్య సంప్రాప్తమవగ
పాలనము సేసి బ్రతుకుట పాడియగునె,
దీనికన్నను భిక్షాన్నమే నయమిల.
తే.గీ. మహిత గురువులన్ వధియించి మనుట శ్రేయ
మవదుగ, కన రక్త కలిత మయిన రాజ్య
భోగముల కంటె బ్రతుకఁగ ముష్టి మేలు.
పాపమును తిని బ్రతుకుట పాడి యగునె?
భావము.
మహానుభావులైన గురువులను చంపడం శ్రేయస్కరం
కాదు. వారిని సంహరించి రక్తసిక్తాలైన
రాజ్యభోగాలు అనుభవించడం కంటే బిచ్చ
మెత్తుకోవడం మేలు.
శ్లో. న చైతద్విద్మః కతరన్నో గరీయో
యద్వా జయేమ యది వా నో జయేయుః |
యానేవ హత్వా న జిజీవిషామః
తే௨వస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః || 6
తే.గీ. యుద్ధమును చేయుటొప్పౌనొ? యొప్పు కాదొ?
యెఱుఁగ లేకుంటి,విజయంబదెవరికగునొ
తెలియ దెవరిని చంపినతృప్తిఁ గనుదొ
వారె యెదురుగనుండిరి నీరజాక్ష!
తే.గీ. రణ ఫలంబది గ్రహియింప రాదు నాకు,
జయమొ, యోటమియో చెప్పఁ జాలముకద,
యెవరినివధించిన విరక్తి నెరయును మది
నదిగొ ధార్తరాష్ట్రులిచటనెదుట కలరు.
భావము.
యుద్ధం చేయడం మంచిదో కాదో తెలియడం
లేదు. మనం జయిస్తామో, వారు జయిస్తారో
చెప్పలేము. ఎవరిని చంపితే మనకు జీవితం
మీద విరక్తి కలుగుతుందో ఆ ధార్తరాష్ట్రాదులే
ఎదురుగా ఉన్నారు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.