జైశ్రీరామ్.
శ్లో. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః |
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః || 23 ||
తే.గీ. అగ్ని కాల్చగ లే దాత్మ నరసి చూడ,
శస్త్రములు చీల్చలేవు ప్రశస్తమయిన
నీరు తడుపంగలే దిక ఘోరమైన
గాలి యెండగాఁ జేయలే దేలొ? కనుమ.
భావము.
ఈ ఆత్మను ఆయుధాలు నరకలేవు; అగ్ని కాల్చలేదు; నీరు
తడుపలేదు; గాలి ఎండబెట్టలేదు.
శ్లో. అచ్ఛేద్యో௨యమదాహ్యో௨యమక్లేద్యో௨శోష్య ఏవ చ |
నిత్యః సర్వగతః స్థాణురచలో௨యం సనాతనః || 24 ||
తే.గీ. ఆత్మ ఖండింపఁబడని దీవరసి చూడ,
కాల దగ్నికి, తడవదు కనగ నీటి
కి నిల నెండదు, నిత్యము, వినగ శాశ్వ
తంబ దచలమునయి, సనాతనమెఱుంగ,.
భావము.
ఆత్మ ఖండించరానిది, కాలనిది, తడవనిది, ఎండనిది; అది
నిత్యం, సర్వవ్యాప్తం, శాశ్వతం, చలనరహితం, సనాతనం.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.