జైశ్రీరామ్.
శ్లో. కులక్షయే ప్రణశ్యన్తి కులధర్మాః సనాతనాః |
ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోऽభిభవత్యుత ||1-40||
తే.గీ. కుల వినాశనము వలనకూలిపోవు
మన సనాతన ధర్మము,మహినధర్మ
మున నడుతురుగ పాపులై మన కులజులు
చింతఁ జేయుము నీవును శ్రీకరుండ!
భావము.
కులక్షయం వలన సనాతనమైన ధర్మం నశిస్తుంది.
ధర్మం నశించినపుడు యావత్కులంఅధర్మం వైపు తిరుగుతుంది.
శ్లో. అధర్మాభిభవాత్కృష్ణ ప్రదుష్యన్తి కులస్త్రియః |
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసఙ్కరః ||1-41||
తే.గీ. వ్యాప్తమగు నధర్మముననే
యాడువారు
చెడుదు రద్దానిచేతను చెడును కులము.
వర్ణ సంకరమేర్పడు, వసుధపైన
నీవు చింతింపుమో కృష్ణ! ధీవరేణ్య!,
భావము.
కృష్ణా! అధర్మం వ్యాపించడంతో కులస్త్రీలు చెడిపోతారు.
కులస్త్రీలు చెడితే వర్ణసంకరం ఏర్పడుతుంది.
జైహింద్
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.