గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, జనవరి 2022, శనివారం

దూరేణ హ్యవరం కర్మ.. || 2.49 || ..//..బుద్ధియుక్తో జహాతీహ ఉభే.. || 2.50 || ..//..సాంఖ్య యోగము.

 జైశ్రీరామ్.

శ్లో.  దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ |

బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః || 49

తే.గీ.  భక్తితోచేసి సత్కర్మ వదలుమహిత

హీనకర్మలన్, ,కోరుచున్ హృద్యముగను

శరణు వేడుము,హీనులా శను మునుగుచు 

ఫలము లాశింత్రు, నీవటుల్ వలదు పార్థ! 

భావము.

ధనంజయా! భక్తియుక్తమైన సేవచే హీనములైన కర్మములన్నింటినీ దూరముగా 

వదులుము. తృష్ణచైతన్యముతో భగవంతుని శరను పొందుము. కర్మఫలములను 

అనుభవింపగోరువారు లోబులు.

శ్లో.  బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే |

తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ || 50

కం.  సమ భావన కల మహితులు

ప్రముదంబున విడుతురిటనె పాపము పుణ్యం

బమలిన నీవు నటులనే,

గమనింపుచు చేయుము మిదె కన యోగమగున్.

భావము.

సమభావన కలిగిన పురుషుడు పుణ్యపాపాలు రెండింటినీ ఈ లోకంలోనే 

వదిలేస్తున్నాడు. కనుక  సమత్వబుద్ధి అయిన నిష్కామకర్మనే నీవు ఆచరించు. 

కౌశలంతో కర్మలు చేయడమే యోగమని తెలుసుకో

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.