జైశ్రీరామ్.
శ్లో. వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ |
కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్ || 2 . 21||
తే.గీ. చావుపుట్టుకల్ లేనిదై శాశ్వతమయి
యుండునాత్మయం చెఱిగిన నోపునెవఁడు
చంపగను దాని దానిచేఁ జంపఁజేయ?
పార్థుఁడా! నీ వెఱుఁగవొకొ? పద్ధతినిట.
భావము.
పార్థా ! ఆత్మ నాశనరహితమనీ, చావు పుట్టుకలు లేనిదనీ, శాశ్వత
మైనదనీ తెలుసుకున్నవాడు ఎవరినైనా ఎలా చంపుతాడు?
ఎలా చంపిస్తాడు?
శ్లో. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో௨పరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ || 2 . 22||
తే.గీ. ప్రాత చిరిగిన వస్త్రము విడిచిపెట్టి
నూతనంబైన వస్త్రమును తొడుగునటు,
శిధిలదేహంబు వీడుచు జీవుం_డటులె
క్రొత్త దేహంబులో చేరి కుదురుకొనును
భావము.
మానవుడు చినిగిపోయిన పాతబట్టలను విడిచిపెట్టి క్రొత్తబట్టలు
వేసుకున్నట్లే ఆత్మ కృశించిన శరీరాలను వదలి కొత్త దేహాలు
పొందుతుంది.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.