జైశ్రీరామ్.
శ్లో. స్వయం తథా న కర్తవ్యం స్వగుణాఖ్యాపనం పునఃస్వగుణాఖ్యాపనం యుక్త్యా పరద్వారా ప్రయోజయేత్.
క. తమ సద్గుణ సంపదలను
ప్రముదంబున తా వచింప రాదు జగతిలో.
తమగుణముల నితరులు కని
ప్రముదంబుగ పొగడ వలయు. భవ్యంబదియే.
భావము. ఎవరును తమ సద్గుణములను మరల మరల తామే చెప్పుకొనకూడదు. యుక్తిగా పరులద్వారా ఆ గుణాలు లోకానికి తెలియజేయాలి.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.