జైశ్రీరామ్.
శ్లో. దుర్జన వచనాంగారైర్ధగ్నోஉపి న విప్రియం వదత్యార్యఃఅగరు రపి దహ్యమానః స్వభావగంధం పరిత్యజతి కిం ను ?
గీ. దురితు కఠినోక్తులన్ మది మరిగియు నిల
సుజనుడప్రియంబులు పల్కఁ జూడడు కద!
దహన మౌచును గంధపు తరువు తనదు
మంచి వాసన పంచును. మహితమదియె.
భావము. దుర్జనుల వచనాగ్నితో దహింపబడినా సజ్జనుడు అప్రియమైన మాటలు మాట్లాడడు. అగరువత్తి తాను కాలిపోతున్నా తన సహజసిద్ధమైన సుగంధాన్ని వదలుతోందా ఏమి?
జైహింద్.
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.