జైశ్రీరామ్.
శ్లో. కోஉన్ధో ? యోஉకార్యరతః , కో బధిరో ? యో హితాని న శ్రుణోతి కో మూకో ? యః కాలే ప్రియాణి వక్తుం న జానాతి.
ఆ. చేయ రాని పనులు చేసిన గ్రుడ్డియే.
హితము వినని వాఁడు క్షితిని చెవిటి.
పలుక వలయు చోట పలికమి మూగయే.
తెలిసి మసలుకొనుడు తెలివి చూపి.
భావము. ఎవడు గ్రుడ్డివాడు? కానిపనులు చేసేవాడు! ఎవడు చెవిటివాడు? హితవాక్యాలు విననివాడు! ఎవడు మూగవాడు ? తగిన సమయంలో ప్రియభాషణం చేయటం తెలియనివాడు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.