జైశ్రీరామ్.
శ్లో. అకామాన్ కామయతి యః, కామయానాన్ పరిత్యజేత్బలవంతం చ యో ద్వేష్టి తమాహుః మూఢచేతసమ్.
క. ఇష్టపడని వారినిష్టపడుచు, తన
నిష్టపడెడివారినిష్టపడక,
బలునితోడ వైరములు పెట్టుకొని చెడు
మూర్ఖుడెపుడు. కనుడు పూజ్యులార!
భావము. ఎవడు తనను ఇష్టపడనివారిని ఇష్టపడతాడో, ఎవడు తనను ఇష్టపడేవారిని వదలుకుంటాడో, ఎవడు బలవంతునితో వైరం పెట్టుకుంటాడో వానిని మూఢాత్ముడు అంటారు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అంతటా ఉన్నదేమరి .ఒకరికి నచ్చితే మరొకరికి నచ్చరు ఇద్దరికీ నచ్చిన సాంగత్యం చాలా తక్కువ . ఇకబలవంతునితోవైరం అనుభవేద్యమే గానీ వర్ణనాతీతం.మంచి సంగతి చెప్పారు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.