జైశ్రీరామ్.
శ్లో. దీపో భక్షయతే ధ్వాంతం కజ్జలం చ ప్రసూయతే యదన్నం భక్షయతే నిత్యం జాయతే తాదృశీ ప్రజా.
క. దీపము చీకటిఁ దినుచును
నేపుగ కాటుకను గను. తినేదే పగిదో
యాపగిది ప్రభవ మగు కన.
దీపించెడి నీతిఁ గను సుధీవరులారా!
భావము. దీపం చీకటిని భక్షిస్తుంది. కాటుకను కంటుంది.ఎట్టి ఆహారం నిత్యమూ భక్షిస్తే ,అట్టి సంతానమే కలుగుతుంది.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.