జైశ్రీరామ్.
శ్లో. భుంజానో న బహు బ్రూయాత్ , న నిందేదపి కంచనజుగుప్సిత కథాం నైవ శృణుయాదపి నా వదేత్.
గీ. భోజనము చేయునప్పుడు మూగ వగుము.
పరుల నింపఁ బోకుము. పరమ రోత
కొలుపు మాటలు వినకుము పలుకఁ బోకు.
శాంత మతివౌచు భుజియింప సత్ఫలమిడు.
భావము. భోజన సమయంలో అతిగా మాట్లాడకూడదు. ఎవరిని గూర్చియు నిందచేయరాదు. రోత కలిగించే విషయాలను వినకూడదు. ప్రస్తావించకూడదు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.